ఆపరేషన్ సిందూర్ 2.0కు సిద్ధం: ఆర్మీ చీఫ్ ద్వివేది
న్యూదిల్లీ: భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు. అవసరమైతే ఆపరేషన్ సిందూర్ 2.0కు భారత సైనిక బలగాలు సర్వ సన్నద్ధంగా ఉన్నాయని చెప్పారు. భూతల, గగన, సముద్రంలో అత్యాధునిక రీతుల్లో పోరాటానికి త్రివిద దళాలు సామర్థ్యం పెంచుకుంటున్నట్టు తెలిపారు. పుణెలో శనివారం జరిగిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) 150వ పాసింగ్ ఔట్ పరేడ్ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. శాంతి తాత్కాలికమేనని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ సెకెండ్ ఫేజ్‌కు…


