విశాలాంధ్ర అనంతపురం టౌన్ : మహిళల రక్షణ, భద్రతకు జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అనంతపురం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకంఠం సర్కిల్ , తదితర ప్రాంతాలలో పోలీసులు పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా ఆయా ప్రాంతాల్లోని మహిళలతో పోలీసులు నేరుగా మాట్లాడారు. ఒంటరిగా వెళ్లే సమయంలో చైన్ స్నాచింగ్ (గొలుసు దొంగతనాలు) బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని సూచించారు.
ఆపద సమయంలో మహిళలకు రక్షణ కల్పించే ‘శక్తి’ యాప్ విశిష్టతను ఈ సందర్భంగా మహిళలకు వివరించారు. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి మహిళా ఈ యాప్‌ను కలిగి ఉండటం ఎంతో అవసరమని పేర్కొంటూ, అక్కడికక్కడే పలువురు మహిళల మొబైల్స్‌లో ‘శక్తి’ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు. అత్యవసర సమయాల్లో ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలో, పోలీసుల సహాయం ఎలా పొందాలో ప్రాక్టికల్‌గా వివరించారు. మహిళల భద్రత కోసం పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
The post శక్తి బృందాల అవగాహన appeared first on Visalaandhra.


