అంతర్‌రాష్ట్ర గజదొంగతో పాటు మరో ముగ్గురు అరెస్ట్..


జిల్లా ఎస్పీ సతీష్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;;ధర్మవరం పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ఇటీవల చోటుచేసుకున్న వరుస ఇంటి దొంగతనాల కేసులను ఛేదించి, ప్రధాన నిందితుడైన అంతర్‌రాష్ట్ర గజదొంగతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా వారు డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు ప్రభాకర్, రెడ్డప్పలతో కలిసి కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. అనంతరం వారు మాట్లాడుతూ
సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు జరిగిందని, ధర్మవరం ఇన్‌చార్జ్ డీఎస్పీ నరసింగప్ప పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి, సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారాన్ని విశ్లేషించాయి అని తెలిపారు. శాస్త్రీయ దర్యాప్తు ద్వారా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది అన్నారు.అరెస్టు చేసిన నిందితులు
మల్లెల వీరాంజనేయులు (గువ్వ) మధు (వడ్డె రామాంజనేయులు) (41), ఎంజీ కాలనీ, ఎర్రగుంట్ల, ధర్మవరం. సాకే నరసింహులు (నరసింహ) (30), ఎంజీ కాలనీ, ఎర్రగుంట్ల, ధర్మవరం.
దేవరకొండ విజయ్ ఎర్రగుంట్ల, ధర్మవరం. గుజ్జల నారాయణమ్మ, ఎంజీ కాలనీ, ఎర్రగుంట్ల వారు అని తెలిపారు.
నేరాలకు పాల్పడిన విధానం వివరిస్తూ
నిందితులు ఒక ముఠాగా ఏర్పడి రాత్రి వేళల్లో జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా ఎంచుకునేవారు అని, ముందుగా రెక్కీ నిర్వహించి, తాళాలు లేదా తలుపులు ధ్వంసం చేసి ఇళ్లలోకి ప్రవేశించి బంగారం, వెండి ఆభరణాలు, నగదు తదితర విలువైన వస్తువులను అపహరించేవారు అని తెలిపారునేరాల అమలుకు ఉపయోగించిన ఒక ఆటోను దొంగిలించిన బంగారు ఆభరణాలను వివిధ ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి నగదుగా మార్చుకున్నట్లు విచారణలో వెల్లడైంది అని తెలిపారు.
ప్రధాన నిందితుడి నేర చరిత్ర
ప్రధాన నిందితుడు మల్లెల వీరాంజనేయులుపై వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆస్తి సంబంధిత అనేక కేసులు నమోదయ్యాయిఅని తెలిపారు.
గత 25 సంవత్సరాలుగా పాత నేరస్తులతో సంబంధాలు కొనసాగిస్తూ చోరీలకు పాల్పడుతున్న ఈ నిందితుడిపై శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం వన్ టౌన్ టూ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలలో తోపాటు కదిరి ,ములకలచెరువు, ఎన్ పి కుంట, అనంతపురం వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ మరియు అనంతపురం రూరల్, కడప, పులివెందల ,రాయచోటి ,ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు, కర్ణాటక రాష్ట్రంలోని మధుగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డాడు అని తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మొత్తం 30 నుంచి 40 కేసులలో కేసులు నమోదైనట్లు తెలిపారు.
ఇక సాకే నరసింహులుపై రౌడీ షీట్ కేసు నమోదు అయిందని,
స్వాధీనం చేసుకున్న ఆస్తులు
నిందితుల వద్ద నుంచి:
రూ.14.50 లక్షల విలువైన సుమారు 11 తులాల బంగారు ఆభరణాలు
వెండి ఆభరణాలు
ఇతర కీలక ఆధారాలు
స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.
అదనంగా, ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టిన రూ.17 లక్షల విలువైన సుమారు 13 తులాల బంగారాన్ని రసీదులను గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు. వీటితోపాటు ఒక ఆటో నాలుగు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందని వెల్లడించారు.
కేసుకు సంబంధించిన మరిన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. పట్టణంలోని ప్రజలు కూడా
ఇంటి దొంగతనాల నివారణలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,
నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అని,ఇళ్లకు ఐరన్ గ్రిల్స్, అలారం వ్యవస్థలు అమర్చుకోవాలి.
ప్రయాణాలు లేదా కుటుంబ కార్యక్రమాలకు వెళ్లే ముందు సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలి అని తెలిపారు.
లాక్‌డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సేవలను వినియోగించుకోవాలి అని,
ఇంటిని విడిచి వెళ్లే సమయంలో భద్రతా ఏర్పాట్లను తప్పనిసరిగా పరిశీలించాలి.
అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని తెలిపారు.
పోలీసు బృందానికి ప్రశంసలు…
వరుస ఇంటి దొంగతనాల కేసులను వేగంగా ఛేదించి, నిందితులను అరెస్ట్ చేసి, విలువైన ఆస్తులను రికవరీ చేసిన ధర్మవరం పోలీస్ అధికారులు, ధర్మవరం టౌన్ రూరల్ సిఐలు ప్రభాకర్, రెడ్డప్ప , ఎస్సైలు రాజశేఖర్ ఉమాదేవి వీరేష్ క్రైమ్ సీసీఎస్ , ఎస్ ఓ జి టీ సిబ్బంది, ప్రత్యేక బృంద సభ్యులను జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, అభినందించారు.
ఈ మీడియా సమావేశంలో సిఐలు ప్రభాకర్ రెడ్డప్ప ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *