దివంగత ఎన్టీఆర్ జయంతి వేడుకలు జేఎన్టీయూలో దాపరికం..!
గుట్టుచప్పుడు కాకుండా వేడుకలు.. ఎందుకీ భయం?విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం ప్రజలు ఆరాధించిన యుగపురుషుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) జయంతి వేడుకలను జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూఏ ) అనంతపురంలో అధికారులు నిర్వహించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. విశ్వవిద్యాలయ ప్రాంగణం, ఎన్టీఆర్ ఆడిటోరియం వద్ద ఎన్టీఆర్ జయంతి వేడుకలను కంటితుడుపుగా, దాపరికంగా నిర్వహించడమే కాకుండా.. కార్యక్రమం సంబంధించిన సమాచారాన్ని, పత్రికా ప్రకటనలను మీడియాకు రాత్రి 7:16 గంటల…


