బెంగాల్‌లో రాజ్యసభ ఉప ఎన్నికల నగారా.. జూలై 24న పోలింగ్

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అధికార మార్పు తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.మాజీ ముఖ్యమంత్రి,తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి వరుసగా రాజకీయ సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఈడీ,ఆదాయపు పన్ను(ఐటీ)దర్యాప్తులు కొనసాగుతుండగా,ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన పలువురు ప్రముఖులపై కూడా కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిణామాల మధ్య మరో కీలక పరిణామంగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన మూడు రాజ్యసభ స్థానాల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల…

Read More

తెలంగాణలో వాయుగుండం ప్రభావం.. పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక

తెలంగాణలో గత వారం రోజులుగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటడంతో పాటు నైరుతి రుతుపవనాలు చురుకుగా కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరిన్ని భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.దీంతో పలు జిల్లాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.నైరుతి రుతుపవనాల సీజన్‌లో తొలి రుతుపవన వాయుగుండం ఆదివారం ఉదయం ఏర్పడి,అదే రోజు రాత్రికి ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో తీరం…

Read More

ఖరీఫ్‌కు ఎల్‌నినో ఎఫెక్ట్‌..16 జిల్లాల్లో లోటు వర్షపాతం

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచే ఎల్‌నినో ప్రభావం రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది.జూన్‌ 1 నుంచి జులై 5 వరకు నమోదైన వర్షపాత గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 16 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఈ కాలంలో సాధారణంతో పోలిస్తే 28.9 శాతం తక్కువ వర్షాలు కురిశాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాల కొరత కనిపించింది.ఈ రెండు జిల్లాల్లో సాధారణ వర్షపాతంతో పోలిస్తే 53.4 శాతం తక్కువ వర్షం నమోదైంది.కొన్ని మండలాల్లో మాత్రమే ఆశాజనకంగా వర్షాలు…

Read More

కొరియాలో మంత్రి లోకేశ్‌.. షూఆల్స్ ఛైర్మన్‌తో కీలక భేటీ

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ప్రఖ్యాత ఫుట్‌వేర్ సంస్థ షూఆల్స్ ఛైర్మన్‌తో భేటీ అయ్యారు. సియోల్‌లో ఆ సంస్థ ఛైర్మన్ & సీఈవో లీ చియాంగ్-గెన్‌తో సమావేశమైన లోకేశ్‌, రాష్ట్రంలో పాదరక్షల తయారీ యూనిట్ పనులను వేగవంతం చేయాలని కోరారు. గతంలో కుదిరిన ఒప్పందం (ఎంవోయూ) ప్రకారం రూ.300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ యూనిట్ ద్వారా దాదాపు 3 వేల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి…

Read More

బీజేపీ జపం చేస్తున్న వారే రాముని డబ్బు లూటీ

దేవుని పేరిట రూ.20 వేల కోట్లు మాయం!జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే ధ్వజంబెంగళూరు: బీజేపీ జపం చేస్తున్న వారే అయోధ్య రాముని ఆలయం విరాళాలు లూటీ చేశారని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే విమర్శించారు. దేవనహళ్లిలో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించి మాట్లాడారు. అయోధ్యలో రామమందిరం పేరిట రూ.20 వేల కోట్ల విలువైన బంగారం, నగదు మాయం అయిందని వార్తలు వస్తున్నాయన్నారు. దేవుని పేరిట ధర్మానికి నేతృత్వం వహించిన పెద్దలే దొంగతనం…

Read More

మా ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభ పెడుతోంది: మమత

కోల్ కతా: తమ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి చీలికలు చేసే కుట్రలు చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మభ్యపెట్టి ఆకర్షించడం బిజెపి దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. కేవలం స్వార్థంతో ప్రతిపక్షాల గొంతు నొక్కి, అడ్డు తొలగించడంలో భాగంగానే ఇటువంటి చర్యలకు పూనుకుంటున్నారని ధ్వజమెత్తారు. టీఎంసీలో చోటుచేసుకుంటున్న మార్పులకు కాషాయ పార్టీనే కారణమని, అసమ్మతి నేతలను రెచ్చగొడుతోందన్నారు. తమ పార్టీలో నిజాయతీ లేని…

Read More

బద్రీనాథ్‌లోనూ విరాళాల దుర్వినియోగం! – Visalaandhra

అంతర్గత విచారణకు కమిటీ ఆదేశాలుబద్రీనాథ్ (ఉత్తరాఖండ్): ఆయోధ్య రాముని ఆలయ విరాళాల చోరీతో దేశ వ్యాప్తంగా హిందూ దేవాలయల సొత్తుపై పెద్ద చర్చ నడుస్తుంటే…ఇప్పుడు విష్ణు ఆలయంలో విరాళాల దుర్వినియోగం అంటూ ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తోన్న ఈ ఆరోపణలను ఆలయ కమిటీ తీవ్రంగా పరిగణించింది. వెంటనే అంతర్గత విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంపై బద్రినాథ్, కేథారినాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) అధ్యక్షుడు హేమంత్ ద్వివేది మాట్లాడుతూ… ‘నిధుల దుర్వినియోగం జరిగిందంటూ సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు…

Read More

హోర్మూజ్‌లో సేవా రుసుం

మిత్ర దేశాలకు ప్రత్యేక ప్రాధాన్యత: ఇరాన్బీజింగ్/ తెహ్రాన్: ప్రపంచ చమురు రవాణా మార్గానికి అత్యంత కీలకమైన హోర్మూజ్ జలసంధిలో ఇరాన్ సేవా రుసుము వసూలు చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో చైనాలోని ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా రహ్మానీ కీలక వ్యాఖ్యలు చేశారు. హోర్మూజ్ తమ ప్రాదేశిక జలాల్లో భాగమని, జలసంధిలో సేవా రుసుం వసూలు చేస్తామని పేర్కొన్నారు. అయితే ఇవి టోల్ కిందకు రావన్నారు. ఈ విషయంపై ఒమన్‌తో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. కష్టసమయంలో…

Read More

బీజేపీ ఎమ్మెల్యేకు నాలుగేళ్లు జైలు శిక్ష

వైద్యురాలి మృతి కేసులో దోషిగా తేల్చిన రౌస్ ఎవెన్యూ కోర్టున్యూదిల్లీ: బీహార్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాజుకుమార్ సింగ్‌కు నాలుగేళ్ల జైలుశిక్ష పడింది. ఓ వైద్యురాలి మృతి కేసులో ఆయన దోషిగా తేలడంతో దిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. 2019 నూతన సంవత్సర వేడుకల్లో జరిగిన ఫైరింగ్‌లో డాక్టర్ అర్చనా గుప్తా మృతిచెందిన కేసులో ఆయన్ను దోషిగా తేల్చుతూ తీర్పు వెలువరించింది న్యాయస్థానం. ఈ కేసులో ఆయనకు జైలుశిక్షతో పాటు…

Read More

ఎస్.కె యూనివర్సిటీ టాపర్గా శ్రీజ – Visalaandhra

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని వివేకానంద డిగ్రీ కళాశాలలో శ్రీజ ఎస్కే యూనివర్సిటీ ప్రకటించిన మూడవ సెమిస్టర్ ఫలితాలలో యూనివర్సిటీ టాపర్గా నిలిచింది అని ప్రిన్సిపాల్ కారణం హర్షవర్ధన్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మా కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతూ 95 శాతంను సాధించిందని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్, డైరెక్టర్లు, తోటి విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీజ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనము గుర్తింపబడాలి అంటే కష్టపడి చదవక తప్పదని…

Read More