వైద్యురాలి మృతి కేసులో దోషిగా తేల్చిన రౌస్ ఎవెన్యూ కోర్టు
న్యూదిల్లీ: బీహార్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాజుకుమార్ సింగ్‌కు నాలుగేళ్ల జైలుశిక్ష పడింది. ఓ వైద్యురాలి మృతి కేసులో ఆయన దోషిగా తేలడంతో దిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. 2019 నూతన సంవత్సర వేడుకల్లో జరిగిన ఫైరింగ్‌లో డాక్టర్ అర్చనా గుప్తా మృతిచెందిన కేసులో ఆయన్ను దోషిగా తేల్చుతూ తీర్పు వెలువరించింది న్యాయస్థానం. ఈ కేసులో ఆయనకు జైలుశిక్షతో పాటు రూ.25 లక్షల జరిమానా కూడా విధించింది.
కేసు వివరాలు ఇలా ఉన్నాయి…
2018 డిసెంబరు 31 అర్ధరాత్రి దిల్లీలోని ఫతేపూర్ బేరీ ప్రాంతంలో రాజుకుమార్ సింగ్ ఫామ్‌హౌస్‌లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆయన గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ సమయంలో అక్కడే ఉన్న డాక్టర్ అర్చనా గుప్తా(45) తలకు బుల్లెట్ తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆమో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై నమోదైన కేసులో విచారణ చేపట్టిన న్యాయస్థానం… గత జూన్‌లో రాజుకుమార్ సింగ్‌ను బీఎనఎస్-304(2) సహా ఆయుధ చట్టంలోని నిబంధనల్ని ఉల్లంఘించారని దోషిగా తేల్చింది. అయితే…శిక్షను ఖరారు చేసే సమయంలో రాజుకుమార్ సింగ్‌కు ఎలాంటి హత్యోద్దేశం లేదని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. ప్రజాప్రతినిధిగా ఆయనకు మంచి పేరుండటంతో శిక్షను తగ్గించాలని కోర్టును అభ్యర్థించారు. నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం… నాలుగేళ్ల జైలుశిక్షతో పాటు 25 లక్షల రూపాయల జరిమానా విధించింది.


