ఎఫ్ఎంసీ విధానానికి ముగింపు.. ఆటో మ్యుటేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారసత్వంగా సంక్రమించిన భూముల మ్యుటేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కుటుంబ సభ్యుల మధ్య వారసత్వ ఆస్తుల విభజనకు సంబంధించిన దస్తావేజులు రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే మ్యుటేషన్ కూడా స్వయంచాలకంగా జరిగే విధానాన్ని అమలు చేయాలని సీసీఎల్ఏ జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.ఇంతకుముందు వారసత్వ భూముల మ్యుటేషన్ కోసం కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం (ఎఫ్ఎంసీ) ఆధారంగా స్వర్ణ గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో దరఖాస్తు సమర్పించాల్సి ఉండేది.అనంతరం రెవెన్యూ…


