స్మశాన వాటికల కొరతపై ఎమ్మెల్యే దృష్టికి సిపిఐ…
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండలంలో స్మశాన వాటికల సమస్యలు తీవ్రరూపం దాల్చడంతో సిపిఐ నాయకులు సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి వినతి పత్రం సమర్పించారు.స్మశానాలకు రహదారులు లేకపోవడం, భూముల కొరత వంటి సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి సాకే గంగాధర్ మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా మృతదేహాలను అంత్యక్రియల కోసం తీసుకెళ్లే సమయంలో సరైన మార్గాలు…


