నిబంధనలకు పాతర
ఇష్టారాజ్యంగా ప్రైవేటు కళాశాలల నిర్వహణ*కార్పొరేట్ మాఫియా గుప్పిట్లో విద్యావ్యవస్థ*నిద్రమత్తులో అధికార యంత్రాంగం (విశాలాంధ్ర-చిత్తూరు) జిల్లాలో ప్రైవేటు జూనియర్ కళాశాలల ఆగడాలు హద్దులు దాటుతున్నాయి. విద్యను సేవా భావంతో కాకుండా లాభదాయక వ్యాపారంగా మార్చిన కొన్ని విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి. జిల్లాలోని ప్రైవేటు కళాశాలల్లో దాదాపు 80 శాతం సంస్థలు కనీస అనుమతులు లేకుండానే దర్జాగా కార్యకలాపాలు సాగిస్తుండటం గమనార్హం. ప్రతి కళాశాలకు అగ్నిమాపక, పొల్యూషన్ సర్టిఫికెట్లు ఉండాలన్న నిబంధన ఉన్నా మెజారిటీ కళాశాలలు వీటిని…


