News Desk

నాలుగు సార్లు రైతుబంధు ఎగ్గొట్టారు: కేటీఆర్

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ సెగలు మరింత రాజుకున్నాయి. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ మెంబర్‌షిప్ డ్రైవ్‌లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని, కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు కురిపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలను గుర్తుచేస్తూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు నిలిచిపోతుందని గతంలో కేసీఆర్ చెబితే.. మేమేమన్నా దీవానాగాళ్లమా.. మాకు ధిమాక్ లేదా అని ఒకాయన మాట్లాడారు. మరి ఇవాళ కాంగ్రెస్…

Read More

పొగాకు వినియోగం ఆరోగ్యానికి హానికరం – Visalaandhra

డీ ఎం.హెచ్ఒ శ్రీనివాస్ రెడ్డి విశాలాంధ్ర- అనంతపురం టౌన్ : పొగాకు పదార్థాల వినియోగం హానికరం అని డీ ఎం.హెచ్.ఓ.డా శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ప్రపంచ పొగాకు ప్రత్యేక దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నందు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పొగాకు వినియోగంతో కలిగే అనర్థాలపై ముద్రించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డి ఎం అండ్ హెచ్ ఓ మాట్లాడుతూ… పొగాకు వినియోగం వలన నోటి క్యాన్సరు, గుండె…

Read More

2న బూత్ స్థాయి ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమం

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియకు సంబంధించి నియోజకవర్గంలోని బూత్ స్థాయి ప్రతినిధులకు (బీఎల్‌ఏలు) జూన్ 2వ తేదీ మంగళవారం నార్పలలో శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి తెలిపారు.మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజనాథ్ సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా…

Read More

తెలంగాణ ఎడ్‌సెట్ 2026 ఫలితాలు విడుదల

తెలంగాణలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎడ్‌సెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రతాప్ రెడ్డి ఈ ఫలితాలను వెల్లడించారు. ఈ పరీక్షలో మొత్తం 96.95 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వారు తెలిపారు. ఈ ఏడాది ఎడ్‌సెట్‌కు మొత్తం 35,600 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 29,342 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 28,446 మంది అర్హత సాధించినట్లు ప్రకటించారు….

Read More

చిన్న పిల్లాడిపై ఇలాంటి బౌలింగా?.. – Visalaandhra

వైభవ్‌పై బాడీలైన్ బౌలింగ్‌పై విమ‌ర్శ‌లు!వైభవ్‌ను కట్టడి చేసేందుకు రబడ, సిరాజ్ అతడి శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని బౌలింగ్గుజరాత్ బౌలర్లు అనుసరించిన వ్యూహంపై విమర్శలువైభవ్‌పై బాడీలైన్ బౌలింగ్‌ను తప్పుబట్టిన మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం ముగిసింది. అయితే, 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మాత్రం తన అద్భుత పోరాటంతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో 47 బంతుల్లో 96 పరుగులు…

Read More

వైభవ్‌కు ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందలేదు : అశ్విన్

వైభవ్ సూర్యవంశీ చిన్నపిల్లాడు.. అలా చూసి బాధగా అనిపించిందిఐపీఎల్ క్వాలిఫయర్‌లో 96 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన వైభవ్రాజస్థాన్ జట్టు ఆటతీరుపై అసహనం వ్యక్తం చేసిన అశ్విన్ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైన తర్వాత, ఆ జట్టు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తీవ్ర నిరాశలో మునిగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 96 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోరును 200 పరుగులు దాటించినా, ఫలితం లేకపోయింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమితో…

Read More

మళ్లీ ‘పులి’ సంచారం – Visalaandhra

హడలెత్తుతున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులుపోలవరం: గత నాలుగు నెలలుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులను హడలెత్తిస్తోన్న పెద్ద పులి… మళ్లీ దాడులు చేస్తూ భయాందోళనలకు గురి చేస్తోంది. ఇటీవల రాత్రి వేళల్లో పశువులపై దాడి చేస్తూ … పోలవరం జిల్లాలో తిరుగుతూ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు రాజమహేంద్రవరం అటవీ ప్రాంతంలో సంచరించిన పెద్దపులి…ఇప్ప్పుడు గంగవరం మండలంలోకి ప్రవేశించింది. పులి సంచారంతో ఆయా గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. ఏలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్, ఆర్డీపురం పరిసరాల్లో సంచరించింది….

Read More

సీబీఎస్ఈ పోర్టల్‌పై సైబర్ దాడి – Visalaandhra

న్యూదిల్లీ: దేశంలోని పరీక్షా విధానంలో ఇటీవల తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. మొన్నటికి మొన్న నీట్ పరీక్షా పత్రాలు లీక్ కాగా…తాజాగా సీబీఎస్ఈ పోర్టల్‌పై సైబర్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ పోర్టల్ పేమెంట్ సిస్టమ్‌ను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 50 మంది విద్యార్థులు పోర్టల్‌లోకి అనధికారికంగా లాగిన్ అయినట్లు సమాచారం. ఈ మేరకు హ్యాకింగ్ గురించి ప్రభుత్వ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. సీబీఎస్ఈ 12వ తరగతిలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం)…

Read More

ఉచిత కంటి వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..

ఐఓఎల్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాంవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో జూన్ 7వ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) నిర్వహించబడే ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి వెంకట నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా వారు స్వాతి…

Read More

దివంగత ఎన్టీఆర్ జయంతి వేడుకలు జేఎన్టీయూలో దాపరికం..!

గుట్టుచప్పుడు కాకుండా వేడుకలు.. ఎందుకీ భయం?విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం ప్రజలు ఆరాధించిన యుగపురుషుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) జయంతి వేడుకలను జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూఏ ) అనంతపురంలో అధికారులు నిర్వహించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. విశ్వవిద్యాలయ ప్రాంగణం, ఎన్టీఆర్ ఆడిటోరియం వద్ద  ఎన్టీఆర్ జయంతి వేడుకలను కంటితుడుపుగా, దాపరికంగా నిర్వహించడమే కాకుండా.. కార్యక్రమం సంబంధించిన సమాచారాన్ని, పత్రికా ప్రకటనలను మీడియాకు రాత్రి 7:16 గంటల…

Read More