News Desk

7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు తరలిరండి

జూన్ 6, 7 తేదీల్లో రాజమండ్రిలో నిర్వహణ అనంతలో ఘనంగా గోడపత్రికల ఆవిష్కరణ విశాలాంధ్ర అనంతపురం టౌన్ : శ్రీశ్రీ కళావేదిక, చైతన్య సారస్వత పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో జరగనున్న ఏడవ ప్రపంచ సాహిత్య మహాసభలకు తరలిరావాలని పలువురు కవులు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఛైర్మన్ కత్తిమండ ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో సుదీర్ఘ సాహిత్య యాత్రలో భాగంగా, ఈసారి రాజమహేంద్రవరంలో ఒక మహా సాహిత్య చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధమవుతోందన్నారు….

Read More

వత్సవాయి మండల టీడీపీ ఉపాధ్యక్షులుగా దారెల్లి చిరంజీవి

మహానాడు పండుగ వేళ వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీలో సరికొత్త ఉత్సాహం ​విశాలాంధ్ర- వత్సవాయి: సమర్థుడైన నాయకుడు ప్రజా సేవకు కట్టుబడిన వ్యక్తి దారెల్లి చిరంజీవి వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించడం పట్ల మండల ప్రజల్లో హర్షందారెల్లి చిరంజీవి అంటే మండల ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు కష్టం ఎక్కడ ఉంటే కార్యకర్తకు నష్టం జరిగితే తనదైన శైలిలో చేయూతనిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలబడుతూ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి గా నిలబడుతున్నారని…

Read More

హాస్టల్ గదిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

కాలేజీ వేధింపులే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆందోళన విశాలాంధ్ర – నార్పల..నార్పల మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన కుటుంబ సభ్యులను, గ్రామస్తులను విషాదంలో ముంచెత్తింది. మండల పరిధిలోని జంగమరెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఫర్టిలైజర్ వ్యాపారి కురుబ రాజా కుమారుడు యశ్వంత్ కుమార్ (17) కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యను అభ్యసిస్తున్నాడు.గత రాత్రి హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని యశ్వంత్…

Read More

అరటి తోట దగ్ధం..అన్నదాత కష్టం అగ్నికి ఆహుతి..

విశాలాంధ్ర, ఉరవకొండ..ఎన్నో ఆశలతో సాగు చేసిన అరటి తోట అగ్నికి ఆహుతికావడంతో ఓ రైతు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వజ్రకరూరు మండలం తట్రకల్లు గ్రామానికి చెందిన రైతు ఆవుల వెంకటరమణ కుటుంబానికి ఆధారంగా నిలుస్తుందనే ఆశతో ఐదు ఎకరాల్లో అరటి సాగు చేశారు. అయితే శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు తోటకు నిప్పంటించడంతో మొత్తం తోట మంటల్లో కాలిపోయింది. కొన్ని నెలలుగా శ్రమించి పెంచుకున్న అరటి చెట్లు కళ్లముందే అగ్నికి ఆహుతవుతుండటాన్ని చూసి రైతు కుటుంబ సభ్యులు…

Read More

డ్రోన్ నిఘాతో జూద స్థావరంపై పోలీసుల దాడి..ముగ్గురు అరెస్ట్.. నగదు స్వాధీనం

విశాలాంధ్ర, చిలమత్తూరు..జూదం, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ పర్యవేక్షణలో హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్ ఆధ్వర్యంలో చిలమత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతలపల్లి గ్రామ శివారులో జూద స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించారు.చిలమత్తూరు ఎస్సై శ్రీధర్ పోలీసు సిబ్బందితో కలిసి డ్రోన్ సర్వైలెన్స్ సహాయంతో నిర్వహించిన ఈ దాడిలో జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి…

Read More

క్రికెట్ బెట్టింగ్ ముఠాపై మెరుపు దాడి..

రూ.13.20 లక్షల నగదు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ విశాలాంధ్ర – హిందూపురం..హిందూపురం మండలం తూముకుంట ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలో నిర్వహిస్తున్న అక్రమ క్రికెట్ బెట్టింగ్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఖచ్చితమైన సమాచారంతో మెరుపు దాడి నిర్వహించిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.13.20 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం హిందూపురం అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ మీడియాకు వెల్లడించారు. హిందూపురం…

Read More

సబ్‌స్టేషన్ ముట్టడించిన రైతులు.. ఎండిపోతున్న పంటలపై ఆవేదన

విశాలాంధ్ర – కంబదూరు విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు శుక్రవారం కంబదూరు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. గత వారం రోజులుగా వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని మండిపడ్డారు. ముఖ్యంగా టమోటా సాగు కోసం లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామని, కరెంట్ లేక…

Read More

పుస్తకాల పేరుతో వేల రూపాయల వ్యాపారమా?

ప్రైవేట్ పాఠశాలల దోపిడీపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి : ఏఐఎస్యూ జిల్లా అధ్యక్షుడు కనుమ దామోదర్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు పుస్తకాల పేరుతో వేల రూపాయలు వ్యాపారం చేస్తున్నాయని ఆ ప్రైవేట్ పాఠశాలల దోపిడీపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్యూ జిల్లా అధ్యక్షుడు కనుమ దామోదర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వారు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని పలు ప్రైవేట్…

Read More

సంక్షేమ పథకాల నుంచి అంతర్జాతీయ చెల్లింపుల వరకు డిజిటల్ రూపాయి..

ఆర్బీఐ కీలక నిర్ణయందేశంలో డిజిటల్ కరెన్సీ వినియోగాన్ని మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్లేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు చిల్లర వ్యాపార రంగంలోనూ డిజిటల్ కరెన్సీ వినియోగాన్ని పెంచాలని భావిస్తున్నట్లు తన వార్షిక నివేదికలో వెల్లడించింది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న డిజిటల్ కరెన్సీ ప్రయోగాత్మక కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో గుజరాత్, పుదుచ్చేరి, చండీగఢ్ ప్రాంతాల్లో నగదు బదిలీ పథకాల కింద డిజిటల్…

Read More

వీరి ఫొటోలు, వీడియోలను ప్రసారం చేయడం నేరం…

సెక్స్ వర్కర్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు స్వచ్ఛందంగా లైంగిక వృత్తిలోకి వచ్చిన వారిపై కేసులు పెట్టొద్దన్న సుప్రీంకోర్టుమీడియాకు హెచ్చరికసెక్స్ వర్కర్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్వచ్ఛందంగా లైంగిక వృత్తిని ఎంచుకున్న వారికి, మానవ అక్రమ రవాణా ద్వారా బలవంతంగా ఈ వృత్తిలోకి నెట్టబడిన బాధితులకు మధ్య చాలా తేడా ఉందని వ్యాఖ్యానించింది. ఈ రెండు వర్గాల మధ్య ఉన్న తేడాను గుర్తించాలని సూచించింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది….

Read More