ముక్కంటి భూములకు రక్షణేదీ..?
*మౌనముద్రలో అధికారులు..*రూ.కోట్లు విలువ చేసే ఆస్తులు పరాధీనం! (విశాలాంధ్ర-శ్రీకాళహస్తి) దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయం భక్తుల పాలిట కల్పవృక్షం. నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తూ, రాహు-కేతు పూజలతో స్వామివారికి కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుతున్నారు. అయితే, భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పించిన భూములు, ఆస్తుల విషయంలో మాత్రం దేవదాయ శాఖ అధికారులు ఘోర వైఫల్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ముక్కంటి ఆస్తులు కళ్లముందే కరిగిపోతున్నా, అన్యాక్రాంతమవుతున్నా అధికారులు మాత్రం మౌనముద్ర వహించడం పలు విమర్శలకు దారితీస్తోంది. నిర్లక్ష్యం…


