Telugu Desam Party: నో కాబినెట్ ఛాన్స్.. మళ్లీ ఆ పదవితోనే సర్దారు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

ఏపీలో పల్లా శ్రీనివాసరావు మరోసారి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు, నారా లోకేష్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించగా నేతలు హర్షం వ్యక్తం చేశారు

ఏపీలో మరోసారి ఆయనకే టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పదవి అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబ
ఏపీలో మరోసారి ఆయనకే టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పదవి అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబ

ఏపీలో రెండోసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస రావుకి బాధ్యతలు అప్పగించారు. తనపై నమ్మకముంచి రెండోసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస రావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

అట్టడుగు వర్గాలకు, బీసీలకు రాజకీయంగా అండగా నిలబడటం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యం. ఒక బీసీ బిడ్డగా నాకు ఈ స్థాయి గుర్తింపు లభించిందంటే అది చంద్రబాబు గారి దూరదృష్టి, బీసీల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనం. కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా, సీనియర్ల అనుభవాన్ని గౌరవిస్తూనే యువతను ప్రోత్సహిస్తూ తెలుగుదేశం పార్టీని భవిష్యత్ తరాలకు ఒక తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నా అన్నారు.

తెలుగుదేశం పార్టీ నవ శకానికి వారధిగా, కోట్లాది మంది కార్యకర్తల ఆశల ఆశాకిరణంగా ఎదిగిన యువనేత నారా లోకేష్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టడం హర్షణీయం అన్నారు. తన అసాధారణ పనితీరుతో, చెక్కు చెదరని సంకల్పంతో అటు పార్టీ క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని, ఇటు యువతరాన్ని ఏకతాటిపైకి తెచ్చిన లోకేష్ నియామకం.. టీడీపీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అన్నారు. నాయకత్వం అంటే కేవలం పదవి కాదు, అంకితభావంతో కూడిన బాధ్యత అని నిరూపించిన ఆయన, రాబోయే రోజుల్లో పార్టీని మరిన్ని విజయ తీరాలకు చేర్చడం ఖాయం అన్నారు.

టీడీపీలో కార్యకర్తే అధినేత. సామాన్య కార్యకర్తకు జాతీయ, రాష్ట్ర స్థాయి బాధ్యతలు ఇచ్చే ఏకైక పార్టీ టీడీపీ అని మరోసారి రుజువైంది. సామాన్య మండల అధ్యక్షురాలిని, క్లస్టర్ ఇంఛార్జీలను పార్టీలో అత్యున్నత కమిటీ అయిన పోలిట్ బ్యూరోలో స్థానం కల్పించడం హర్షణీయం. జాతీయ, రాష్ట్ర కమిటీల్లో నూతనంగా నియమితులైన నాయకులకు హృదయపూర్వక అభినందనలు అన్నారు.

మీరు ఎంపిక కావడం మీ శ్రమ, నిబద్ధత, పార్టీ సిద్ధాంతాలపట్ల ఉన్న అనురాగానికి గుర్తింపు. మీ నాయకత్వం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. తెలుగుదేశం పార్టీ అన్ని స్థాయిల్లో మరింత బలపడుతుందని, ప్రజాసేవలో స్ఫూర్తిని కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మీరు చేపట్టబోయే ఈ కొత్త బాధ్యతల్లో విజయం సాధించాలని పార్టీ తరఫున, కార్యకర్తల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *