News Desk

అప్పుల బాధ.. మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య

విశాలాంధ్ర – యాడికి: అనంతపురం జిల్లా యాడికి మండలంలోని రాయలచెరువు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, మద్యానికి బానిస కావడంతో ఓ వ్యక్తి క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగుచూసింది.పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తలారి కృష్ణయ్య (38) తన భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. రైతుల వద్ద కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని…

Read More

ఘనంగా భారత మహిళా సమాఖ్య 72వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు :భారత మహిళా సమాఖ్య 72వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు సీఆర్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. గురువారం ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి శ్రావణి రెడ్డి అధ్యక్షతన జెండా ఆవిష్కరణ జరిగింది. ముందుగా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ ఎస్ గిడ్డమ్మ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 1954లో భారత జాతీయ మహిళా సమాఖ్య కలకత్తా లో ఏర్పాటు చేయయడం జరిగిందన్నారు. మహిళా సమాఖ్య ఏర్పాటులో…

Read More

ప్రిన్స్‌టన్ విద్యాసంస్థలకు సుప్రీంలో చుక్కెదురు

న్యూదిల్లీ: తెలంగాణలోని ప్రిన్స్‌టన్ విద్యాసంస్థలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా ‘ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ’ పేరు వాడటంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా వర్సిటీతో తమకు సంబంధం లేదని బోర్డులు పెట్టాలని తెలంగాణ కాలేజీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు మోసపోకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జూన్ 12వ తేదీ లోగా ప్రముఖ దినపత్రికల్లో పావు పేజీ ప్రకటనలు ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించింది. The post ప్రిన్స్‌టన్…

Read More

రుద్ర ఎం-11 ప్రయోగం విజయవంతం – Visalaandhra

న్యూదిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన గగనతలం నుండి భూతల క్షిపణి రుద్ర ఎం-11 ప్రయోగం విజయ వంతమైంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ), భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సంయు క్తంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించా యి. భారత్ తన కచ్చితమైన దాడుల సామర్థ్యాల ను బలోపేతం చేయడా నికి, రక్షణ సాంకేతికతలో స్వావలం బనను పెంపొందించుకో వడానికి చేపడుతున్న చర్యల్లో ఈ ప్రయోగం మైలురాయిగా నిలిచింది. అన్ని కీలక ఉపవ్యవస్థలు, ప్రయోగ పరిమితుల పనితీరును…

Read More

ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు రాజ్యాంగ రక్షణ ఉండదు

న్యూదిల్లీ: ఆన్‌లైన్ బెట్టింగ్ నైపుణ్యానికి సంబంధించిన ఆట అయినప్పటికీ దానికి రాజ్యాంగ రక్షణ ఉండబో దని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వివిధ క్రీడలపై ఆన్‌లైన్ బెట్టింగ్ లను నిషేధిస్తూ తమిళనాడు, కర్నాట క చేసిన చట్టాల రాజ్యాంగబద్ధతను సమర్థించింది. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ అంశాలపై చట్టాలు రూపొందించేందుకు రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉందని జస్టిస్ పార్థివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. సమాజ హితం, శాంతి భద్రతల దృష్ట్యా ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం…

Read More

మళ్లీ దద్దరిల్లిన గల్ఫ్

. అమెరికా స్థావరాలపై విరుచుకుపడ్డ ఇరాన్. కువైట్, బెహ్రెయిన్‌పై దాడులు. ఇది ఆత్మరక్షణే: ఐఆర్‌జీసీ తెహ్రాన్: పశ్చిమాసియా మళ్లీ బాంబుల మోత మోగింది. డ్రోన్‌లు, క్షిపణుల దాడులతో దద్దరిల్లింది. శాంతి చర్చలు జరుగుతుండగానే అమెరికా- ఇరాన్ మధ్య భీకర పోరుసాగింది. కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ విరుచుకుపడింది. కువైట్‌లోని అల్ సలేం`బహ్రెయిన్‌లోని ఈసా వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. అంతర్జాతీయ చట్టం, కాల్పుల విరమణను అతిక్రమించి, ఖేష్మ్ ద్వీపంలోని కమÖ్యనికేషన్స్ టవర్‌పై, హోర్మూజ్ జల…

Read More

నేపాల్‌లో నిరసనల హోరు

ప్రధాని బాలెన్ షా రాజీనామాకు డిమాండ్వీధుల్లోకి వచ్చిన విద్యార్థులు`ప్రతిపక్షాలుసార్వభౌమత్వం కాపాడుదామని నినాదంనష్ట నివారణ చర్యల్లో విదేశాంగ శాఖ ఖాట్మండు: నేపాల్ రాజకీయం మళ్లీ వేడెక్కింది. సరిహద్దు ఆక్రమణలపై ప్రధాని బాలెన్ షా వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. దేశమంతటా నిరసనలను హోరెత్తాయి. బాలేంద్ర ‘బాలెన’ షా రాజీనామాకు డిమాండ్ మార్మోగింది. భారత్`నేపాల్ సరిహద్దు వివాదం గురించి పార్లమెంటులో బాలెంద్ర చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ప్రధాని రాజీనామాను డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు కూడా గొంతు…

Read More

రేపటి నుంచి సవరించిన భూముల విలువలు

. క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా నిర్ణయం. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విశాలాంధ్ర-హైదరాబాద్: రాష్ట్రంలో భూముల విలువలను సవరించాలని, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గు లున్న భూముల ధరలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు సవరించిన భూముల విలువలు ఈ నెల 5 నుంచి అమలులోకి తెస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Read More

ఉద్యోగులకు భరోసాగా జీవిత బీమా – Visalaandhra

మృతుని భార్యకు రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి విశాలాంధ్ర-హైదరాబాద్: ఉద్యోగులకు భరోసాగా జీవిత బీమా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన లైన్‌మెన్ సోన్కాంబ్లే ప్రమోద్ కుమార్ భార్య (నామినీ) సోన్కాంబ్లే స్వప్నకు రూ. 1 కోటి విలువైన ప్రమాద బీమా చెక్కును బుధవారం ప్రజాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన అందజేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎన్పీడీసీఎల్‌కు గతంలో కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంఓయు)…

Read More

రాజకీయ ప్రయోజనాల కోసంతెలుగు ప్రజల్లో చిచ్చుపెట్టొద్దు

. పవన్ కల్యాణ్‌కు కూనంనేని చురక. పరిపక్వత లేని వివాదాస్పద వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటని నిలదీత. నేడు బషీర్‌బాగ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం విశాలాంధ్ర – హైదరాబాద్: ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయడం ప్రజా ద్రోహమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎలఏ కూనంనేని సాంబశివరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ పరిపక్వత…

Read More