గోదావరిలో 1,435 టీఎంసీల నీళ్లు.. తెలంగాణకు 968 టీఎంసీలు.. ఏపీకి 516
గోదావరి నదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1,435 టీఎంసీల నీటి లభ్యత ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసింది. పోలవరం ద్వారా మళ్లించే 45 టీఎంసీల జలాలను కలుపుకుంటే మొత్తం లభ్యత 1,480 టీఎంసీలకు చేరుతుందని వెల్లడించింది. ఇందులో తెలంగాణకు 968 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 516 టీఎంసీల వాటా ఉన్నట్లు పేర్కొంది. జీఆర్‌ఎంబీ ఆధ్వర్యంలో సమావేశంగోదావరి పరీవాహక ప్రాంతం, ఉప బేసిన్‌లలో నీటి లభ్యతపై మంగళవారం దిల్లీలోని సీడబ్ల్యూసీ కార్యాలయంలో గోదావరి నది యాజమాన్య బోర్డు…


