ప్రధాని బాలెన్ షా రాజీనామాకు డిమాండ్
వీధుల్లోకి వచ్చిన విద్యార్థులు`ప్రతిపక్షాలు
సార్వభౌమత్వం కాపాడుదామని నినాదం
నష్ట నివారణ చర్యల్లో విదేశాంగ శాఖ
ఖాట్మండు: నేపాల్ రాజకీయం మళ్లీ వేడెక్కింది. సరిహద్దు ఆక్రమణలపై ప్రధాని బాలెన్ షా వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. దేశమంతటా నిరసనలను హోరెత్తాయి. బాలేంద్ర ‘బాలెన’ షా రాజీనామాకు డిమాండ్ మార్మోగింది. భారత్`నేపాల్ సరిహద్దు వివాదం గురించి పార్లమెంటులో బాలెంద్ర చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ప్రధాని రాజీనామాను డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు కూడా గొంతు కలిపాయి. కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలపై వివాదం నేపథ్యంలో నేపాల్ కొన్నిచోట్ల సరిహద్దు వెంబడి ఆక్రమణలకు పాల్పడినట్లు బాలేంద్ర అంగీకరించడం ప్రజాగ్రహ జ్వాల రగిల్చింది. ఈ మÖడు ప్రాంతాలు తమ దేశ అంతర్గత భూభాగాలని వీటి విషయంలో రాజీ ప్రసక్తే లేదని భారత్ గతంలో చాలా సార్లు స్పష్టం చేసింది. అయితే నేపాల్ పార్లమెంటులో సుదీర్ఘ సరిహద్దు వివాదం గురించి ప్రధాని బాలేంద్ర షా ఇటీవల ప్రస్తావించారు. సరిహద్దు వెంబడి అనేక చోట్ల భారతదేశ భూభాగంలోకి నేపాల్ చొరబడినట్లు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు పెద్ద వివాదానికి తెర తీశాయి. విపక్షాలు ఆక్షేపించడంతో సభ దద్దరిల్లింది. ప్రధాని వ్యాఖ్యలు నేపాల్ ప్రాంతీయ సార్వభౌమత్వాన్ని బలహీనపరిచినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు ఐక్యంగా రాజధాని ఖాట్మండు వీధుల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించి, ప్రధాని రాజీనామాను డిమాండ్ చేశాయి. ‘సార్వభౌమత్వం కాపాడుకుందాం’ అని నినాదమిచ్చాయి. ప్రధానివి విద్రోహ వ్యాఖ్యలంటూ ఆగ్రహం వ్యక్తంచేశాయి. నేపాలీ కాంగ్రెస్ అనుబంధ తరుణ్ దళ్ మరొక ఆందోళలో ప్రధాని మాటలు సరిహద్దు అంశాýపై నేపాల్ దీర్ఘకాల వైఖరిని కించపరిచినట్లు వ్యాఖ్యానించింది. కాగా, నేపాల్ దౌత్య విధానాన్ని నీరుగార్చే విధంగా బాలేంద్ర షా వ్యాఖ్యలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. తాజా గందరగోళాన్ని పరిష్కరించే పనిలో నేపాల్ విదేశాంగ శాఖ నిమగ్నమైంది. నష్ట నివారణ చర్యలు చేపట్టింది.
ప్రధాని పేర్కొన్న ‘ఆక్రమణలు’ పదం కాలాపానీ, లిపులేఖ్ వంటి వివాదాస్పద ప్రాంతాలను ఉద్దేశించినది కాదని చెప్ప్పుకొచ్చింది. నదీ సరిహద్దులు మారడం వల్ల ‘నో-మ్యాన్స్ ల్యాండ’ (దస్గజా) ప్రాంతంలో రెండు దేశాల ప్రజలు సాగు చేసుకుంటున్న సరిహద్దు దాటిన చిన్నపాటి ఆక్రమణలను మాత్రమే ప్రధాని ప్రస్తావించారని వివరణ ఇచ్చింది.
The post నేపాల్‌లో నిరసనల హోరు appeared first on Visalaandhra.


