ఉద్యోగులకు భరోసాగా జీవిత బీమా – Visalaandhra
మృతుని భార్యకు రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి విశాలాంధ్ర-హైదరాబాద్: ఉద్యోగులకు భరోసాగా జీవిత బీమా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన లైన్‌మెన్ సోన్కాంబ్లే ప్రమోద్ కుమార్ భార్య (నామినీ) సోన్కాంబ్లే స్వప్నకు రూ. 1 కోటి విలువైన ప్రమాద బీమా చెక్కును బుధవారం ప్రజాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన అందజేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎన్పీడీసీఎల్‌కు గతంలో కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంఓయు)…


