Last Updated:
Godavari New Rail Bridge: రాజమండ్రి గోదావరిపై నుంచి మరో రెండు లైన్లతో కూడిన రైల్వే బ్రిడ్జిలు రానున్నాయి. ఒక్క గోదావరి పైనే కాదు దాదాపు 6 జిల్లాలను అనుసంధానం చేస్తూ ఈ నాలుగు లైన్ల రైల్వే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రణాళికను రైల్వే సర్వం సిద్ధం చేసింది.
Godavari New Rail Bridge: రాజమండ్రి గోదావరిపై నుంచి మరో రెండు లైన్లతో కూడిన రైల్వే బ్రిడ్జిలు రానున్నాయి. ఒక్క గోదావరి పైనే కాదు దాదాపు 6 జిల్లాలను అనుసంధానం చేస్తూ ఈ నాలుగు లైన్ల రైల్వే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రణాళికను రైల్వే సర్వం సిద్ధం చేసింది. ఇందుకోసం నిధులను కూడా సుమారు రూ. 10 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఇటు పారిశ్రామికంగా ఇటు ప్రయాణికుల దృష్ట్య ఇదో అద్భుతమైన పురోగతిగా చెప్పుకోవచ్చు. అనేకమంది విశ్లేషకులు సైతం విశాఖ నుంచి విజయవాడ వరకు ఫోర్త్ లైన్ పడితే ఆ అభివృద్ధి వేరు అంటూ విశ్లేషిస్తున్నారు. ఈ విషయంపై రైల్వే ఏం చెబుతుంది.. ? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ నాలుగు లైన్లు పనులు జరుగుతాయి..? ఒకసారి క్లుప్తంగా చూద్దాం.
రాజమండ్రి సమీపంలోని నిడదవోలు నుంచి విశాఖపట్నం వరకు ఫోర్త్ లైన్ రైల్వే లైన్ వేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు రూ. 10 కోట్ల రూపాయలతో గోదావరి పైనుంచి ఈ మూడు, నాలుగు లైన్లు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. దీంతో రైల్వే సైతం ఈపనులు ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఏపీలో ఉన్న గూడ్స్ ప్రయాణం చేసేందుకు ప్రత్యేకంగా ఒక రైల్వే ట్రాక్ మూడవదిగా రైల్వే శాఖ నిర్మిస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ మధ్యకాలంలో అనకాపల్లి జిల్లాలో వచ్చే స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు అంతకుమించి చుట్టూ ఉన్న హార్బర్, పోర్టు వంటివి కావచ్చు. వీటి నుంచి ఎక్స్పర్ట్స్ అనేవి అధికంగా జరుగుతూ ఉంటాయి. ఇలా మూడవ లైన్ దాదాపుగా ఈ రవాణాకి రైల్వే ఉపయోగిస్తుందని సమాచారం.
ఇక నాలుగో లైన్ దాదాపుగా విశాఖపట్నం నుంచి పశ్చిమగోదావరి జిల్లా వరకు ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ సమీప ప్రాంతాల గుండా రైలు ప్రయాణం దేశ విదేశాల నుంచి సైతం అనేక మంది చేస్తూ ఉంటారు. దీంతో వారికి సైతం వెసులు ఈ నాలుగవ లైను ఉపయోగిస్తారు అన్నది చర్చగా సాగుతుంది. ముఖ్యంగా వీటి ద్వారా రైల్వేకు అత్యున్నత ఆదాయం సమకూరడం ఉందని తద్వారా రాష్ట్రం సైతం అభివృద్ధి పథంలో నడుస్తుందని రైల్వే జడ్ ఆర్ యు సిసి సభ్యులు బోడపాటి శ్రీను తెలియజేశారు. ఏదేమైనా త్వరగా ఈ పనులు పూర్తయితే ఏపీలో రైల్వే ద్వారా ఆ అభివృద్ధి వేరు అంటూ ప్రజల పేర్కొంటున్నారు.
అయితే ఇప్పటివరకు టూ లైన్స్ నుంచి ఫోర్ లైన్స్ కు చేయాలి అంటే ఈ ట్రాక్ అనేది ఏర్పాటు చేయవలసి ఉంటుంది. దీంతో భూ సేకరణతో పాటు రైలు వెళ్లే మార్గంలో తాండవ పంప ఇలా అనేక నదులు సైతం మార్గమధ్యంలో ఉంటుంటాయి. వాటిపై సైతం ప్రత్యేక బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా అతి కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ కేంద్రం సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో త్వరలో ఈ పనులు ప్రారంభం అవుతాయని ప్రజల సైతం ఆశిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Rajahmundry,East Godavari,Andhra Pradesh


