సూర్యవంశీని టీ20 బరిలోకి దింపాలి: గవాస్కర్


క్రీడలు: టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత టీ20 జట్టుకు ఎంపికైన నేపథ్యంలో టీమఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యల చేశారు. ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో అతడికి బరిలోకి దిగే అవకాశం కల్పించాలని సూచించారు. రెగ్యులర్ ఓపెనర్లను పక్కన పెట్టైనా సరే వైభవ్‌ను ఆడించాలన్నారు. ‘నేనైతే వైభవ్ సూర్యవంశీని ఐర్లాండ్ సిరీస్‌లో ఆడిస్తాను. అతడు ఐర్లాండ్‌తో టీ20 మ్యాచ్‌లు ఆడటాన్ని చూడాలని కోరుకుంటున్నాను. అతడికి తుది జట్టులో చోటు ఇవ్వాలి. అవసరమైతే ఒక మ్యాచ్‌లో సంజుశాంసన్‌ను, మరో మ్యాచ్‌లో అభిషేక్ శర్మను పక్కపెట్టైనా సరే… వైభవ్‌ను ఆడించాలి’ అని సునీల్ గవాస్కర్ అన్నారు. ‘వైభవ్ ఎంపిక ముందు నుంచీ అనుకున్నదేనని, అతడిని ఫామ్‌ను, సాధించిన పరుగులను చూడండి. దీని తర్వాత వైభవ్‌ను ఎంపిక చేయకుండా ఉంటారా? అతడు…డ్రెస్సింగ్ రూమ్ నుంచి చాలా నేర్చుకుంటాడు. అది వైభవ్‌కు కెరీర్‌లో ఎంతో ఉపయోగపడుతుంది’ అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో సత్తా చాటిన విషయం తెలిసిందే. 16 ఇన్నింగ్స్‌ల్లో 776 పరుగులు సాధించి… ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. ఏకంగా 72 సిక్సర్లు బాది…ఒక ఐపీఎల్ సీజన్‌లో అదిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు. 23 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 ఐపీఎల్ పరుగులు సాధించి… అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత బ్యాటర్‌గా రికార్డ్ సృష్టించాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *