విశాలాంధ్ర – కడియం : కూటమి ప్రభుత్వం నర్సరీ రంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. కడియం మండలం కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీని శుక్రవారం ఆయన సందర్శించారు. ఆయనకి సత్యదేవ నర్సరీ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లా పెద్దసత్యనారాయణ, సప్తగిరి నర్సరీ రైతు కుప్పాల దుర్గారావు లు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మామిడి మొక్కతో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నర్సరీరంగం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని, ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ప్రత్యేక ప్రణాళికలు చేస్తున్నారన్నారు. పువ్వులు, పళ్ల మొక్కలలో కొత్త రకాల గురించి, అలాగే మాచర్ల నియోజకవర్గంలో ఉధ్యాన పంటలు అభివృద్ధి గురించి ఎమ్మెల్యే వారితో చర్చించారు. అంతకుముందు జనసేన సీనియర్ నాయకులు, చిరకాల మిత్రుడు పాఠంశెట్టి రవి స్వగృహానికి వెళ్లి, ఆతిథ్యం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గట్టి నరసయ్య, మెర్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


