AMRUT Scheme: పలమనేరుకు భారీ వరం.. అమృత్ పథకం కింద రూ.16.5 కోట్ల నిధులు మంజూరు..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ మౌలిక వసతుల కల్పనలో మరో కీలక అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమృత్ పథకం కింద పలమనేరు పట్టణానికి భారీగా నిధులు విడుదలయ్యాయి.

News18
News18

చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ మౌలిక వసతుల కల్పనలో మరో కీలక అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమృత్ పథకం కింద పలమనేరు పట్టణానికి భారీగా నిధులు విడుదలయ్యాయి. తాగునీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి రూ. 14.30 కోట్ల నిధులు రాగా, స్వచ్ఛభారత్ పథకం కింద పట్టణ సౌందర్యీకరణ కోసం రూ. 2.2 కోట్లు మంజూరయ్యాయి. ఈ రెండు నిధులు కలిపి మొత్తం రూ. 16.5 కోట్లతో పట్టణంలో పలు భారీ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ నిధుల ద్వారా ప్రజల తాగునీటి కష్టాలు తీరడమే కాకుండా, పట్టణం సరికొత్త రూపు సంతరించుకోనుంది.

ఈ అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లను ప్రముఖ నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ప్రతినిధులు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు సోమవారం నాడు పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల ప్రణాళికలపై ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడారు. పట్టణంలో చేపట్టే ప్రతి పనిలోనూ నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఎక్కడా రాజీ పడకూడదని కాంట్రాక్ట్ సంస్థకు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పనులు జరిగే సమయంలో స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు.

ఈ భారీ నిధులతో పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అధునాతన ట్యాంకుల నిర్మాణం, పైప్‌లైన్ పనులు చేపట్టనున్నారు. గంటావూరు ప్రాంతంలో 4.5 లక్షల కిలోలీటర్ల భారీ సామర్థ్యంతో సరికొత్త నీటి ట్యాంక్ నిర్మిస్తారు. గడ్డూరులో 3 లక్షల కిలోలీటర్ల కెపాసిటీతో మరో నీటి నిల్వ ట్యాంక్ అందుబాటులోకి రానుంది. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతంలో 2.5 లక్షల కిలోలీటర్ల సామర్థ్యంతో మూడో ట్యాంక్ నిర్మించనున్నారు. పట్టణ పరిధిలో దశాబ్దాల క్రితం వేసిన పాత పైప్‌లైన్ల స్థానంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. లీకేజీలు ఉన్న చోట తక్షణ మరమ్మతులు చేపడతారు. స్వచ్ఛ భారత్ నిధుల ద్వారా పలమనేరు పట్టణంలోని పెద్ద చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నారు.

ఈ పనులన్నీ పూర్తయితే పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో నివసించే ప్రజలకు తాగునీటి సరఫరా మరింత మెరుగుపడుతుంది. వేసవి కాలంలో కూడా నీటి కొరత రాకుండా భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. పెద్ద చెరువు అభివృద్ధి చెందడం వల్ల పట్టణ రూపురేఖలు మారి, స్థానికులకు మంచి వినోద కేంద్రం అందుబాటులోకి వస్తుంది. ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి తెలిపారు. నిర్ణీత గడువు లోపు పనులను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేఘా సంస్థ మేనేజర్ సువి రావ్, జిల్లా ప్రజా ఆరోగ్య శాఖ సాంకేతిక అధికారి నాయక్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *