విధి నిర్వహణలో మాజీ సైనికుడి మృతి
విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా): రాజాం మండలం గెడ్డవలస గ్రామానికి చెందిన మాజీ సైనికుడు వెంకన్న ముదిలి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భారత సైన్యంలో 177 మీడియం రెజిమెంట్‌లో సేవలందించిన ఆయన, ప్రస్తుతం విజయవాడలో రైల్వే శాఖలో గ్రూప్-డి ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ రాత్రి డ్యూటీ ముగించుకుని వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుని ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా, మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో జాతీయ పతాకంతో ఘనంగా నివాళులు…


