విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా): రాజాం మండలం గెడ్డవలస గ్రామానికి చెందిన మాజీ సైనికుడు వెంకన్న ముదిలి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భారత సైన్యంలో 177 మీడియం రెజిమెంట్లో సేవలందించిన ఆయన, ప్రస్తుతం విజయవాడలో రైల్వే శాఖలో గ్రూప్-డి ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ రాత్రి డ్యూటీ ముగించుకుని వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుని ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా, మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో జాతీయ పతాకంతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకట సాయి ప్రసాద్, మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాజాం అధ్యక్షుడు ఎన్. సురేష్, చైర్మన్ కరణం ఉమామహేశ్వరరావు, రేగులగడ్డ బిమ్బర్ధన రావు, నాగరాజు తదితర మాజీ సైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
The post విధి నిర్వహణలో మాజీ సైనికుడి మృతి appeared first on Visalaandhra.


