ఫ్రాన్స్‌ను కుదిపేస్తున్న చిన్నారుల లైంగిక వేధింపుల స్కాండల్
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపుల వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.పాఠశాలలు, చిన్నారుల సంరక్షణ కేంద్రాల్లో పిల్లల భద్రతను చూసుకోవాల్సిన సిబ్బందే వారిపై దాడులకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో అధికారులు విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.నగరంలోని 84 ప్రీ స్కూళ్లు, 20 ప్రాథమిక పాఠశాలలు, 10 చిన్నారుల సంరక్షణ కేంద్రాల్లో విచారణ కొనసాగుతోందని పారిస్ ప్రాసిక్యూటర్ లోర్ బెక్యువా తెలిపారు.భోజన విరామాలు, ఆట సమయాలు, పిల్లలు నిద్రించే వేళల్లో వారిని పర్యవేక్షించే…


