తప్పులు మోదీవి, భారం జనం మీద
వాస్తవాలు తెలిసినా అంగీకరించకపోవడం, నిరాకరించడం మోసగించడమే. అసత్యం చెప్పడంలో ట్రంప్ మినహా మోదీని మించిన వారెవరూ లేరు. ఫిబ్రవరి 28న ఇరాన్ మీద అమెరికా, ఇస్రాయెల్ యుద్ధం ప్రారంభించిన వెంటనే మనం కూడా పెట్రోల్, డీసెల్, గ్యాస్ కొరత ఎదుర్కోవాల్సి వస్తుందని అందరికీ తెలుసు. కానీ ప్రధానమంత్రి మోదీ ఈ వాస్తవాన్ని నిరాకరిస్తూ వచ్చారు. మనకు ఇబ్బంది ఏమీ లేదని నమ్మబలికారు. మన దగ్గర గ్యాస్, పెట్రోల్, డీసెల్ ధరలు పెంచే ప్రసక్తి లేదని బూటకపు భరోసా…


