మా ప్రభుత్వంలో పేపర్ లీకులు లేవు: కేజ్రీవాల్
న్యూదిల్లీ: తమ పార్టీ దిల్లీలో అధికారంలో ఉన్న పదేళ్లపాటు ఎటువంటి పేపర్ లీక్‌లు చోటుచేసుకోలేదని ఆప్ అధినేత, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఈ లీక్‌లు మొదలయ్యాయని ఆయన ఆక్షేపించారు. దేశంలో తరచూ తలెత్తుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాలపై ఆయన మరోసారి మండిపడ్డారు. ప్రశ్నాపత్రాల లీక్ వెనుక బిలియన్ల విలువ చేసే వ్యాపారాలు నడుస్తున్నాయని, ఇందులో చాలా పెద్ద వ్యక్తుల హస్తం ఉందని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే…


