విశాలాంధ్ర – యాడికి..యాడికి మండల శివారులోని గుత్తి రోడ్డులో జూనియర్ కళాశాల సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.స్థానికుల వివరాల మేరకు, బైక్ అదుపు తప్పి బోల్తా పడటంతో కిష్టిపాడుకు చెందిన తండ్రీ కొడుకులు మురళీ మోహన్ రెడ్డి, నవనీత్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.వీరు యాడికిలో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన సమయంలో మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


