సుహాస్ సినిమా పేరు మార్పు
హైదరాబాద్: టాలీవుడ్‌లో ఇటీవల సెన్సార్ బోర్డు ఆంక్షలతో దర్శకనిర్మాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల విడుదలైన సంతోష్ శోభన్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రానికి టైటిల్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో దానికి ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చారు. టైటిల్‌ను ‘ఫ్రెండ్లీ కపుల’గా మార్చాలని బోర్డు సూచించినా, చిత్ర యూనిట్ మాత్రం అందుకు నిరాకరించింది. గత నెలలో కూడా ‘వానర’ అనే చిన్న సినిమా టైటిల్‌ను ‘వనవీర’గా మార్చాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఇదే కోవలో సుహాస్, శివాని నగరం జంటగా…


