విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. కే .ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం డిజిటల్ యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం ప్రతి విద్యార్థికి అవసరమని, అందుకు అనుగుణంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఈ శిక్షణలో బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ , ఎమ్మెస్ ఆఫీస్ టూల్స్ కోర్సులు బోధించబడతాయని తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు అని తెలిపారు..శిక్షణ కోసం విద్యార్థులు తమ విద్యార్హతల జిరాక్స్ పత్రాలతో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ శిక్షణా తరగతులు జూన్ మూడవ తేదీ నుండి జూలై రెండవ తేదీ వరకు అనగా నెల రోజుల పాటు నిర్వహించబడుతుందని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల నుండి 12:00 గంటల వరకు తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థినీ విద్యార్థులు నిర్ణీత సమయానికి హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
మరిన్ని వివరాల కోసం కళాశాల కార్యాలయాన్ని లేదా సెల్ నెంబర్ 9441177709,9030701611,7036901085 లకు సంప్రదించగలరు అని తెలిపారు.


