విశాలాంధ్ర అనంతపురం టౌన్ : అనంతపురం జిల్లాకి నూతన అసిస్టెంట్ కలెక్టర్ సుయశ్ కుమార్ సోమవారం విచ్చేశారు. అనంతపురం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ని నూతన అసిస్టెంట్ కలెక్టర్ సుయశ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ప్రభుత్వ ఆదేశాలతో దాదాపు ఏడాది పాటు ఆయన జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ గా వివిధ శాఖల పనితీరు గురించి శిక్షణ తీసుకుంటారు. నూతన అసిస్టెంట్ కలెక్టర్ వివరాలు.. స్వస్థలం : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంకి చెందినవారు. విద్యాభ్యాసం : బిటెక్, ఐఐటి (బనారస్ హిందూ యూనివర్సిటీ), వారణాసి. 2025 ఐ.ఏ.ఎస్ బ్యాచ్.ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఐ.ఏ.ఎస్. అధికారుల శిక్షణ సంస్థ) నుంచి ఫేస్1 శిక్షణ పూర్తి చేసుకుని జిల్లాకు విచ్చేశారు.


