విశాలాంధ్ర -ధర్మవరం; ధర్మవరం డివిజన్లోని అర్బన్ యు పి హెచ్ సి లక్ష్మీ చెన్నకేశవపురం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయంత్ కుమార్ ఆధ్వర్యంలో టీబి సూపర్వైజర్ కిష్టప్ప అధ్యక్షతన కేతిరెడ్డి కాలనీ సచివాలయం, వైఎస్ఆర్ కాలనీ సచివాలయం, లక్ష్మీ చెన్నకేశవపురం సచివాలయం లోని నాడు 60 సంవత్సరాల పైబడిన 128 మందికి మొబైల్ హ్యాండిల్ ఎక్స్ రే మిషన్ ద్వారా క్షయ వ్యాధి పరీక్ష చేయుట కొరకు తీయడం జరిగినది అని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయంత్ కుమార్, టీవీ సూపర్వైజర్ కిష్టప్ప తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ దీని ద్వారా ముందు గానే టిబి వ్యాధి రాకుండా నిర్ధారించి,వ్యాధి వచ్చిన వారికి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిబి ప్రోగ్రాం కోఆర్డినేటర్ నాగేంద్ర ,టిబి సూపర్వైజర్ భాష, మలేరియా అసిస్టెంట్ శ్రీనివాసులు, గాయత్రి, సులోచన ఏ ఎన్ ఎం లు,అరుణ,లలిత,కాంతమ్మ ఆశ లు తదితరులు పాల్గొన్నారు.
The post క్షయవ్యాధి పరీక్షలు.. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయంత్ కుమార్ appeared first on Visalaandhra.


