మోదీ, దీదీ దొందూదొందే: రాహుల్ గాంధీ


కోల్‌కతా: పేదలను పక్కన పెట్టి, పెద్దలను పెంచడంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి మమత ఒకే దోరణితో నడుస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధి విమర్వించారు. వీరిద్దరూ అధికారం కోసం ఎంతటిదానికైనా తెగిస్తారని ధ్వజమెత్తారు. హుగ్లీ జిల్లా సెరాంపోర్‌లో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తూ ‘మోదీ తనను తాను దేశభక్తునిగా చెప్ప్పుకుంటారు కానీ దేశాన్ని అమ్మేస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ధనికులకు అండగా నిలుస్తున్నారే తప్ప పేదలకు కాదని, కేంద్రంలో మోదీది కూడా అదే తంతు అని రాహుల్ విమర్శించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆరెస్సెస్‌ను రాష్ట్రీయ సరెండర్ సంఘ్‌గా అభివర్ణించారు. అమెరికాలో ఆరెస్సెస్ సీనియర్ నేత రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఆ సంస్థ అసలు స్వరూపాన్ని బయటపెట్టాయని చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమంలో రామ్ మాధవ్ మాట్లాడుతూ… అగ్రరాజ్యంతో స్నేహం కోసం భారత్ కొన్ని త్యాగాలు చేసిందని, విపక్షాల నుంచి విమర్శలు ఎదురైనప్పటికీ…ఇరాన్, రష్యా నుంచి చమురు కొనడం ఆపేసినట్లు వెల్లడించారు. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌లను స్వీకరించాల్సి వచ్చిందన్నారు. ఈ వీడియోపై ‘ఎక్స’ వేదికగా రాహుల్ స్పందించారు. ఆరెస్సెస్ నేతలు నాగ్‌పుర్‌లో కూర్చొని జాతీయవాదం గురించి మాట్లాడతారని, అమెరికాలో ఆ దేశానికి విధేయంగా ఉంటారని దుయ్యబట్టారు. తర్వాత మాధవ్ క్షమాపణలు చెబుతూ…తాను చెప్పింది వాస్తవ విరుద్ధమని పేర్కొన్నారు.

The post మోదీ, దీదీ దొందూదొందే: రాహుల్ గాంధీ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *