తెలుగు-ఒడియా ప్రాంతాల దీపస్థంభం
1949 ఆగస్టు 15, జెండా పండగకు ముస్తాబైన విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణం! అక్కడకు వచ్చిన ప్రొఫెసర్ తూమాటి దోణప్ప అక్కడ సాదాసీదా దుస్తుల్లో నిలబడి ఉన్న ఓ మనిషిని చూసి,’ బహుశా సర్వోదయ నాయకుడై ఉంటాడు!’ అనుకున్నారట. అయితే, ఎలాంటి హంగు ఆర్భాటాలు లేని ఆయనే మహారాజా విక్రమ్ దేవ్ వర్మ అని తెలుసుకొని, ఆశ్చర్యలో మునిగిపోయారట!అంత నిరాడంబరంగా జీవించిన మహారాజా విక్రమ దేవ్ వర్మ 1869 జూన్ 28వ తేదీన, కృష్ణచంద్రదేవ్ వర్మ, రేఖా…


