ఘనంగా నర్సస్ డే వేడుకలు..


ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్ర నాయక్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సస్ డే వేడుకలు ఆసుపత్రిలోని హెడ్నర్స్, నర్సుల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిప్పేంద్రనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా సూపర్డెంట్ తో పాటు వైద్యులు, హెడ్ నర్సరీ, సిస్టర్లు ఫ్లోరెన్స్ నైటాంగిల్ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సూపర్డెంట్, వైద్యులు, హెడ్ నర్సుమాట్లాడుతూ రోగులు యొక్క ఆరోగ్యానికి నర్సులు ఎంతో కృషి చేస్తూ వారి జీవన ప్రమాణంలో కీలకపాత్ర వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వచ్చే రోగులకు అన్ని సదుపాయాలతో పాటు వారితో సఖ్యంగా మాట్లాడుతూ రోగము కన్నా ముఖ్యమైనది ప్రేమతో పలకరించడం వల్ల నేడు రోగులు ఆరోగ్యవంతులు అవుతున్నారని తెలిపారు. తదుపరి కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నజీర్, హరి శ్రీనివాస్, రోజా రాణి, వెంకటేశులు, ప్రభుత్వ నర్సులు పాల్గొన్నారు.

The post ఘనంగా నర్సస్ డే వేడుకలు.. appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *