రాజారెడ్డి జీన్స్.. జగన్ జీన్స్ రెండూ ఒకటే’.. యనమల తీవ్ర విమర్శలు..! YS Jagan Mohan Reddy criticism | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

యనమల రామకృష్ణుడు కాకినాడలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాజారెడ్డి జీన్స్ వ్యాఖ్యలు చేస్తూ, ఫ్యాక్షన్, అవినీతి, కుటుంబ రాజకీయాల ఆరోపణలు చేసి ఆర్థిక దుస్థితికి జగన్‌ను కారణమని అన్నారు

+

News18

News18

యనమల రామకృష్ణుడు మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజారెడ్డి జీన్స్, జగన్ జీన్స్ రెండూ ఒకటే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు నాంది పలికింది వైఎస్ కుటుంబమేనని ఆరోపించారు. కాకినాడ జిల్లాలో మీడియాతో మాట్లాడిన యనమల.. జగన్ నిర్వహించిన రెండు గంటల మీడియా సమావేశంపై కూడా తీవ్ర ఎద్దేవా చేశారు.

రెండు గంటల పాటు జరిగిన ప్రెస్‌మీట్‌లో ప్రజా సమస్యల గురించి ఒక్క మాటా లేదు.. సెల్ఫ్ డబ్బా తప్ప మరొకటి వినిపించలేదు అంటూ యనమల విమర్శించారు. నా ఫ్యామిలీ గొప్ప.. నేను గొప్ప అనే మాటలకే జగన్ పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఎలా ఎదగాలో తన తాత, తండ్రి నేర్పించారని జగన్ చెబుతున్నారని.. కానీ ఆయన పూర్తిగా రాజారెడ్డి పాలననే ఫాలో అవుతున్నారని ఆరోపించారు.

కడప ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రారంభించింది రాజారెడ్డేనని యనమల అన్నారు. తన వ్యాపార భాగస్వాములను హత్య చేయించి ఎదిగారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిపక్షం అంటే ప్రజల సమస్యలపై మాట్లాడాలి.. ప్రజలకు ఉపయోగపడే అంశాలు చర్చించాలి. కానీ జగన్ మాత్రం తన కుటుంబ గొప్పతనం చెప్పుకోవడానికే ప్రెస్‌మీట్లు పెడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా యనమల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ముఖ్యమంత్రి కాకముందే, అధికారంలో లేకపోయినా కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఏకకాలంలో 43 వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని అన్నారు. జగన్ ఇలా రాష్ట్ర సంపదను దోచుకోకపోతే ఖజానాలో నిధులు ఉండేవి అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడానికి ప్రధాన కారణం జగనేనని పేర్కొన్నారు.

అంతేకాదు.. కుటుంబ రాజకీయాలపై కూడా యనమల విమర్శలు చేశారు. అమ్మను, చెల్లిని కూడా దూరం పెట్టి ఏకచక్రాధిపత్యం కోసం జగన్ ప్రయత్నిస్తున్నారు అంటూ ఆరోపించారు. యనమల చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *