పరిశ్రమల్లో వ్యవసాయ యూరియా వాడితే కఠిన చర్యలు
జిల్లా వ్యవసాయ అధికారి ఎం. రవి హెచ్చరిక విశాలాంధ్ర – రాప్తాడు: పరిశ్రమల్లో వ్యవసాయానికి వాడే యూరియాను ఉపయోగిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి (ఎం. రవి హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశాల మేరకు శనివారం మండల పరిధిలోని గొందిరెడ్డిపల్లి గ్రామ పారిశ్రామిక వాడ (ఎం.ఎస్.ఎం.ఈ)లో ఉన్న ‘ఎం.ఎస్ పెయింట్స్’ తయారీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీలోని తయారీ విభాగంతో పాటు నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు….


