ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఏపీ ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ అత్యంత భక్తిపూర్వక వ్యాఖ్యలు చేశారు. “మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే దానికి కారణం ఆ ఏడుకొండల వాడే.. ఆ శ్రీనివాసుడి కృప వల్లే జగమంతా సుభిక్షంగా ఉంది” అని ఆయన పేర్కొన్నారు. గురువారం (ఏప్రిల్ 16) తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆయన “నిత్య జీవితంలో ధర్మాచరణం” అనే అంశంపై ప్రవచనం ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన బుధవారం తిరుపతిలోని కపిలేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నారు.
Source link
Chaganti Koteswara Rao in Tirumala: శ్రీవారిపై ఆయన చేసిన వ్యాఖ్యలు వింటే భక్తితో పులకించాల్సిందే!


