‘డిజిటల్ అరెస్టు’ ఉత్తదే… ఎవరూ నమ్మొద్దు
ఆమె బెంగుళూరుకు చెందిన వృద్ధురాలు. పేరు లక్ష్మీˆ రామూˆర్తి. వయస్సు 70 సంవత్సరాలు. ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. పిల్లలందరూ చదువులు పూర్తయి విదేశాల్లో స్థిరపడ్డారు. ఎలాంటి బాదరబందీ లేకుండా జీవిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ సమస్యలు ఏమైనా వస్తాయేమో అనే ఆలోచనలో స్థిరచరాస్తులు అన్నీ విక్రయించేసి సొమ్ములన్నీ బ్యాంకులో దాచిపెట్టారు. మొత్తం దాదాపు 24 కోట్ల దాకా ఉంటుంది. హమ్మయ్య… ఇకనేం…కృష్ణా, రామా అంటూ బతికేయొచ్చు అనుకున్నారేమో. మే నెల మొదటి వారంలో…


