వీర తిమ్మమ్మ ఆలయమునకు విరాళం.. పూజారి శేషు, గ్రామ పెద్దలు


విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని చెరువు కట్ట వద్ద గల శ్రీ వీర తిమ్మమ్మ ఆలయ నిర్మాణం కొరకు గిర్రాజు నగేష్ సమక్షంలో మాధవ నగర్ కు చెందిన పళ్లెం సూర్య ప్రకాష్, వల్లెం చంద్రకళ, కుమారుడు గిరీష్ కుమార్ కుటుంబ సభ్యులు తమ వంతున రూ.1,11,116 లను విరాళంగా అందజేశారు. అనంతరం పూజారి శేషు దాతల పేరిటన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం దాతలు మాట్లాడుతూ వీర తిమ్మమ్మ వారి మహిమలు నాడు పట్టణవ్యాప్తంగా వ్యాప్తి చెందాయని తెలిపారు. అందుకే తమవంతుగా తమ కుటుంబం తరఫున ఈ విరాళాన్ని అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *