కొలతల ప్రకారమే వేతనాలు..ఏపీఓ దయాసాగర్
విశాలాంద్ర వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : ఉపాధిహామీ పథకంలో కొలతలప్రకారమే వేతనాలు ఉంటాయని ఏపీఓ దయాసాగర్ అన్నారు. శుక్రవారం వలేటివారిపాలెం మండలంలోని చుండి గ్రామ పంచాయతీ లో జరుగుచున్న ఉపాధిహామీ పనులను ఏపీఓ దయాసాగర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కూలీల హాజరును స్వయంగా పరిశీలించారు.ముందుగా ఎన్ ఎం ఎం ఎస్ యాప్ ద్వారా నమోదు అయిన కూలీల హాజరును క్షేత్రస్థాయిలో ఉన్న కూలీల సంఖ్యతో సరిచూశారు. అనంతరం పనుల నాణ్యతను కొలతలను పర్యవేక్షించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…


