Newly Bride Suicide: బయటపడ్డ లేడిస్ హాస్టల్ నిర్వాహకుడి సీక్రెట్ వ్యవహారం.. పెళ్లైన 45 రోజులకే నవవధువు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

Visakhapatnam: విశాఖపట్నంలో నవవధువు ప్రాణాలు తీసుకుంది. కాళ్లకు రాసిన పారాణి అరిపోయిందో లేదో ఆమెకు వైవాహిక జీవితంలో కష్టాలు ఎదురయ్యాయి. సరిగ్గా పెళ్లైన 45 రోజుల వ్యవధిలోనే భర్త పెట్టే టార్చర్ భరించలేక ఉరివేసుకుని బలవన్మరణం చేసుకుంది.

Newly Bride Suicide
Newly Bride Suicide

Newly Bride Suicide: విశాఖపట్నంలో నవవధువు ప్రాణాలు తీసుకుంది. కాళ్లకు రాసిన పారాణి అరిపోయిందో లేదో ఆమెకు వైవాహిక జీవితంలో కష్టాలు ఎదురయ్యాయి. సరిగ్గా పెళ్లైన 45 రోజుల వ్యవధిలోనే భర్త పెట్టే టార్చర్ భరించలేక ఉరివేసుకుని బలవన్మరణం చేసుకుంది. అయితే రేసపువాని పాలెంలో ఈవిషాధ సంఘటన చోటుచేసుకుంది. మృతురాలు తేజశ్రీకి నెలన్నర క్రితం శ్రీకాకుళంకి చెందిన సోమేశ్వర రావు వివాహం జరిగింది. అయితే భర్త నగరంలో లేడీస్ హాస్టల్ నడుపుతున్నాడు. అతనికి వేరే అమ్మాయిలతో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించిన తేజశ్రీ భర్త సోమేశ్వర రావును నిలదీయడంతో అతను ఆమెను చిత్రహింసలకు గురి చేస్తూ వచ్చాడు. ఈవేధింపులు భరించలేకపోయిన నవవధువు ప్రాణాలు తీసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాని యువతి బంధువులు మాత్రం భర్త చిత్రహింసలు పెట్టి చంపి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నవవధువుపై టార్చర్..

విశాఖపట్నం రేసపువానిపాలెంలో నివాసముంటున్న తేజశ్రీ అనే నవవధువు బలవన్మరణం చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉంటున్న కొత్త జంట తేజశ్రీ ఆమె భర్త సోమేశ్వర రావుకి నెలన్నర క్రితం వివాహం జరిగింది. అయితే భర్త సోమేశ్వరరావు కొంత కాలం గా నగరం లో లేడీస్ హాస్టల్ నడుపుతున్నాడు. అతనికి వేరే అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నట్లుగా భార్య తేజశ్రీ గమనించినట్లుగా తెలుస్తోంది. అదే విషయాన్ని నిలదీయడంతో బార్యను చిత్రహింసలకు గురి చేయడం మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది.

సెన్సిటివ్ కావడంతో..

కొత్తగా పెళ్లి చేసుకొని కోటి ఆశలతో మెట్టినింట్లో అడుగుపెట్టిన తేజశ్రీకి భర్త పెట్టే టార్చర్, ఆతనికి వేరే అమ్మాయిలతో సంబంధాలు ఉన్న విషయాన్ని శ్రీకాకుళంలో పేరెంట్స్‌కి చెప్పుకుంది తేజ శ్రీ. అయితే మృతురాలి తల్లిదండ్రులు కొత్త కాపురంలో ఇలాంటివి సహజమేనని సర్ది చెప్పడంతో భర్త చేష్టలు తట్టుకోలేకపోయింది. స్వతహాగా సున్నిత మనస్కురాలు కావడంతో తేజశ్రీ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

కటకటాల వెనక్కి భర్త..

మృతురాలి బంధువులు భర్త సోమేశ్వరరావుపై అనుమానం వ్యక్తం చేయడమే కాకుండా తేజశ్రీని అతనే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న త్రీ టౌన్ పోలీసులు సోమేశ్వర రావు పై కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *