ఎన్నికల కౌంట్‌డౌన్‌ ప్రారంభం.. మేలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు!

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా ప్రజాపరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలు (జడ్పీటీసీ), మండల ప్రజాపరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. 2025 జూలై 10 నుంచి 2026 ఫిబ్రవరి 5 వరకు భారత ఎన్నికల సంఘం నవీకరించిన ఓటర్ల జాబితాలోని అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా గుర్తించి,…

Read More

ఠారెత్తించిన ఎండలు.. తెలంగాణలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి!

తీవ్రమైన ఎండలతో తెలంగాణ రాష్ట్రం అగ్నిగోళంలా మారింది. ముఖ్యంగా ఏడు జిల్లాల్లోని 20 మండలాలు వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్‌ మండలం తీవ్రంగా వేడెక్కగా, అదే జిల్లాలో దహేగాం, సిర్పూర్‌(యు) మండలాల్లో కూడా వడగాలులు నమోదయ్యాయి.ఆదిలాబాద్ జిల్లాలో మూడు మండలాలు, కామారెడ్డి జిల్లాలో రెండు, నిర్మల జిల్లాలో రెండు, నిజామాబాద్ జిల్లాలో మూడు, రంగారెడ్డి జిల్లాలో మూడు, సిద్దిపేట్ జిల్లాలో నాలుగు మండలాల్లో వడగాలులు తీవ్రంగా వీచాయి. దస్తురాబాద్‌లో అత్యధిక ఉష్ణోగ్రతరాష్ట్రంలో అత్యధిక…

Read More

హర్మూజ్ వద్ద గందరగోళం.. కదలని నౌకలు!

ప్రపంచ ఇంధన రవాణాకు జీవనాడిగా భావించే హర్మూజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం నెలకొన్నాయి. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో హర్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శుక్రవారం ప్రకటించారు. లెబనాన్ లో కాల్పుల విరమణ అమలులో ఉన్నంత కాలం హర్మూజ్ తెరిచే ఉంటుందని, అన్ని దేశాల నౌకలు రాకపోకలు సాగించవచ్చని చెప్పారు. అయితే, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్ జీసీ) నిర్దేశించిన మార్గంలోనే నౌకలు…

Read More

ధోని ఈరోజైనా దిగుతాడా?

హైదరాబాద్: హోరాహోరీగా సాగుతోన్న ఐపీఎల్ పోటీల్లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. జోరుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస విజయాలతో ఫామ్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. అయిదు మ్యాచ్‌ల్లో రెండేసి విజయాలతో ఒకే స్థితిలో ఉన్న ఈ జట్ల మధ్య పోరుకు శనివారం ఉప్పల్ స్టేడియం వేదికగా నిలవనుంది. గాయం కారణంగా తొలి అయిదు మ్యాచ్‌ల్లో ఆడని చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్‌లో అయినా ఆడతాడా లేదా అన్నది ఆసక్తి…

Read More

దిగ్బంధనం కొనసాగితే…హోర్మూజ్‌ను మూసేస్తాం: ఇరాన్

తెహ్రాన్: ఉద్రిక్తితల నడుమ 47 రోజుల తర్వాత చమురు రవాణాకు కీలకమైన హోర్మూజ్ జలసంధి తెరుచుకుంది. దీంతో వాణిజ్య నౌకల రవాణాకు అడ్డంకులన్నీ తొలగినట్లు అంతా భావించారు. అయితే, ఇరాన్ నౌకల రవాణాపై తమ దిగ్బంధనం కొనసాగుతుందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన ఉద్రిక్తతలను మరోసారి పెంచింది. ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడిన ఇరాన్. దిగ్బంధనం కొనసాగితే హోర్మూజ్‌ను మూసేస్తామని హెచ్చరించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు….

Read More

అమలులోకి వచ్చిన మహిళా రిజర్వేషన్ యాక్ట్.. గురువారం అర్ధరాత్రి నోటిఫికేషన్

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చారిత్రక మహిళా రిజర్వేషన్ చట్టం 2026 ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వచ్చింది. వాస్తవానికి కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్ 2023లోనే ఆమోదముద్ర పడింది. మూడేళ్ల కిందటే చట్టంగా మారింది. అయితే, ఈ చట్టాన్ని గురువారం (ఏప్రిల్ 16) నుంచి అమలులోకి తీసుకొచ్చినట్లు కేంద్రం పేర్కొంది. ఈ మేరకు గురువారం రాత్రి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టాన్ని 2029 సాధారణ ఎన్నికల నాటికే…

Read More

తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు

తెలంగాణలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.దూర ప్రాంతాల్లో నివసించే రోగులు చికిత్స కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేంద్రాలను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ఃహబ్ అండ్ స్పోక్ః విధానంలో నిర్వహించనున్నారు.హైదరాబాద్‌లోని నిమ్స్,…

Read More

కోత లేకుండనే హార్ట్ వాల్వ్ మార్పిడి

రాయలసీమలో మొట్ట మొదటిది ఓపెన్ సర్జరీ లేకుండా చికిత్స 75 ఏళ్ళ వ్యక్తి ఉపశమనం కలిగించిన కిమ్స్ వైద్యులువిశాలాంధ్ర అనంతపురం టౌన్ : ఎటువంటి కోత లేకుండా 75 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా గుండె వాల్వ్ మార్పిడి చేసి నూతన జీవితాన్ని అందించారు కిమ్స్ సవీర వైద్యులు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు *సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా. మూడే సందీప్. అనంతపురం జిల్లాకు చెందిన ఓ 75 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన ఆయాసం, గుండెలో…

Read More

లోక్ సభలో ఆకట్టుకున్న ప్రియాంకా గాంధీ తొలి ప్రసంగం

21 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో సుతిమెత్తగా ప్రభుత్వాన్ని చురకలునెహ్రూ పేరుతో చమత్కారం.. డీలిమిటేషన్ పై ఘాటు హెచ్చరికవయనాడ్ ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాద్రా తన తొలి ప్రసంగంతో పార్లమెంటును ఆకట్టుకున్నారు. శుక్రవారం 21 నిమిషాల పాటు సాగిన ఆమె ప్రసంగంలో వాగ్ధాటి, వ్యంగ్యం, రాజకీయ చతురత కలగలిసి కనిపించాయి. అధికార పక్షాన్ని ఇరుకునపెట్టేలా చమత్కారాలు విసురుతూనే, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సైతం నవ్వించి తనదైన ముద్ర కనబరిచారు. మహిళా రిజర్వేషన్లపై…

Read More

డీలిమిటేషన్‌తో అన్యాయం జరిగితే ఊరుకోం: లోక్‌సభలో మిథున్ రెడ్డి

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. గతంలో విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి, ఆ తర్వాత చట్టంలో లేదంటూ తప్పించుకున్నారంటూ మండిపడ్డారు. ఇప్పుడు డీలిమిటేషన్ విషయంలో కూడా అదే తీరు పునరావృతమైతే సహించేది లేదని ఆయన తెగేసి చెప్పారు. డీలిమిటేషన్ అనేది దేశ నిర్మాణానికి ఉపయోగపడాలి తప్ప, ప్రతిపక్షాలను అణగదొక్కే సాధనంగా మారకూడదని ఆయన…

Read More