ఇరాన్ పై మళ్లీ దాడులు… భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఇవాళ్టి ట్రేడింగ్‌లో భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దక్షిణ ఇరాన్‌లో అమెరికా తాజాగా దాడులు జరపడంతో శాంతి ఒప్పందం ఆశలు సన్నగిల్లాయి. ఈ పరిణామం మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్ 479.26 పాయింట్లు (0.63%) నష్టపోయి 76,009.7 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 118 పాయింట్లు (0.49%) పతనమై 23,913.7 వద్ద ముగిసింది….


