కీలక రంగాల్లో జర్మనీతో భాగస్వామ్యం – Visalaandhra


. టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరస్పర సహకారం కోసం ఎంవోయÖ
. సీఎం రేవంత్‌తో తురింగియా ప్రతినిధి బృందం భేటీ

విశాలాంధ్ర – హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి చర్యలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. జర్మనీలోని తురింగియా రాష్ట్రం కీలక రంగాల్లో తెలంగాణతో భాగస్వామ్యానికి ముందుకొచ్చింది. టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరస్పర సహకారం కోసం తెలంగాణ ప్రభుత్వం, తురింగియా రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. జర్మనీ తురింగియా రాష్ట్ర మినిస్టర్ ప్రెసిడెంట్ మారియో వోయిట్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో బుధవారం ప్రత్యేకంగా సమావేశం కాగా, ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రగతికి జర్మనీ కితాబు…
ఈ సమావేశంలో మారియో వోయిట్ తెలంగాణను భారతదేశంలో అభివృద్ధి, ఆవిష్కరణలకు కేంద్రబిందువుగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన “తెలంగాణ రైజింగ్ – 2047” విజన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ సాధించిన అభివృద్ధి ప్రత్యేకమైనదిగా వ్యాఖ్యానించారు. భారత-జర్మనీ సంబంధాల్లో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. రెండు ప్రాంతాలకు ప్రయోజనం చేకూరేలా కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు అవసరమైన నైపుణ్యాలతో తెలంగాణ యువతను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీలు), పాలిటెక్నిక్ కళాశాలల్లో బోధన విధానాలను మార్చేందుకు తురింగియా సహకారం కావాలని కోరారు. మారియో వోయిట్ స్పందిస్తూ… తెలంగాణ అవసరా లకు అనుగుణంగా ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు రూపొందించేం దుకు తమ పరిశ్ర మలు, విద్యాసంస్థలు సంసిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సెమీకండక్టర్ రంగానికి చెందిన జర్మన్ కంపెనీల ప్రత్యేక బృందాన్ని తెలంగాణకు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక్కడి అవకాశాలను పరిశీలించి పెట్టుబడులపై చర్చలు జరుపుతామ న్నారు. ప్రపంచంలోని ఫార్చ్యూన్-500 కంపెనీలను తెలంగాణకు ఆకర్షించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి అజిత్ రెడ్డి, టీజీఐఐసి ఎండి శశాంక ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *