Last Updated:
డబ్బులు ఎక్కువ ఇస్తామంటే ఎవరైనా ఆశ పడతారు. మరీ ముఖ్యంగా కార్లు, బైక్స్, వెహికల్స్ రెంట్‌కి ఇచ్చే ట్రావెల్స్ యజమానులు ఇందుకు తక్కువ ఏమి కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో కూడా ఇలాంటి మోసమే ఒకటి జరిగింది.
డబ్బులు ఎక్కువ ఇస్తామంటే ఎవరైనా ఆశ పడతారు. మరీ ముఖ్యంగా కార్లు, బైక్స్, వెహికల్స్ రెంట్‌కి ఇచ్చే ట్రావెల్స్ యజమానులు ఇందుకు తక్కువ ఏమి కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో కూడా ఇలాంటి మోసమే ఒకటి జరిగింది. కార్ల యజమానులకు అధిక కిరాయి ఆశ చూపించి నమ్మకంతో కారు అద్దెకు తీసుకుని ఆ తర్వాత EMIలు చెల్లించకుండా వాహనాలను మాయం చేయడం వంటి మోసాలు ఈ మధ్య కాలంలో ఎక్కువ అయ్యాయి. కార్ల యజమానులతో అగ్రిమెంట్స్ చేసుకొని వాళ్లకే టోకరా వేసిన ఓ కేడీని పోలీసులు పట్టుకున్నారు. అతడి చేతిలో మోసపోయిన వాళ్లకు న్యాయం చేయడమే కాకుండా ఇంకెవరూ ఇలాంటి వాళ్లను నమ్మవద్దని సూచిస్తున్నారు.
అనంతపురం జిల్లాలో జరిగిన ఈ వెరైటీ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు సాధారణంగా కార్ల యజమానులతో అగ్రిమెంట్లు చేసుకుని నెలవారీ కిరాయితో పాటు బ్యాంక్ లోన్‌లకు సంబంధించిన EMIలు కూడా తానే కడతానని నమ్మించాడు. కొన్ని నెలల పాటు సక్రమంగానే చెల్లించి, యజమానుల నమ్మకాన్ని పొందిన తర్వాత ఆపై వాహనాలను తీసుకుని అదృశ్యం అవుతాడు.ఆ విధంగా తీసుకెళ్లిన కార్లను ఇతరులకు అక్రమంగా అమ్ముకోవడం (లేదా తాకట్టు పెట్టడం) చేస్తుంటారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన నల్లమాడ పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నారు.
వాహనాల యజమానులు తమ కార్లను ఇతరులకు అప్పగించేటప్పుడు అగ్రిమెంట్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత విచారణ చేసుకున్న తర్వాతే వాహనాలను అప్పగించాలని పోలీసులు తరచూ సూచిస్తుంటారు. నిందితుడు అన్నవరం గౌతం రాజు హిందూపురం ప్రాంతం వాసి. ట్రావెల్స్ యజమానులు, సొంత కార్లు కలిగిన ఓనర్ల దగ్గర కార్లను అద్దెకు తీసుకుని ఇతరులకు కుదువ పెట్టి లక్షల రూపాయలు దండుకుంటున్నాడు. ప్రారంభంలో EMI చెల్లించి నమ్మకంగా మారిన తరువాత తరువాత వచ్చిన మొత్తంతో మోసం చేసి పరార్ అవుతున్న నిందితుడిని పోలీసుల చాకచక్యంతో పట్టుకుని నిందితుడు దగ్గర 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. మారుతి సుజుకి స్విఫ్ట్, వాక్స్ వాగేన్ పోలో, మారుతి సుజుకి బ్రేజ్జా లాంటి కార్లు స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా పోలీస్ అధికారి ఎస్. సతీష్ కుమార్ ఆదేశాలతో, CI వి. శ్రీనివాసులు నేతృత్వంలో కేసును చేధించారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు పంపారు. ప్రస్తుత కాలంలో డిజిటల్ విప్లవం వలనో కొత్తగా వచ్చిన AI ప్రభావం వలనో తెలియదు కానీ పలు కొత్త రకాల స్కాములకు ప్రజలు బలవుతున్నారు. ఇదొ కొత్త రకం స్కామ్ భవిష్యత్తులో ఇలా ఇంకా ఎలాంటి కొత్తరకం స్కాములు చూస్తామో అని ప్రజలు తల పట్టుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Anantapur,Anantapur,Andhra Pradesh



