Last Updated:
Tirumala: అక్షయతృతియ సందర్భంగా టీటీడీ మరో కొత్త రికార్డు నెలకోల్పింది. శ్రీవారి ఫోటోతో ఉన్న గోల్డ్ డాలర్స్ విక్రయంలో ఈసారి గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో అమ్మకాలు జరిపింది.గతేడాదితో పోలిస్తే ఈసారి డాలర్ సేల్స్ గణనీయంగా పెరిగాయి.
Tirumala: అక్షయతృతియ సందర్భంగా టీటీడీ మరో కొత్త రికార్డు నెలకోల్పింది. శ్రీవారి ఫోటోతో ఉన్న గోల్డ్ డాలర్స్ విక్రయంలో ఈసారి గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో అమ్మకాలు జరిపింది. రెండ్రోజుల్లో శ్రీవారి డాలర్లు రూ.1.10 కోట్ల అమ్మకాలు జరిగాయి. బంగారం ధర భారీగా పెరిగినప్పటికి భక్తులు స్వామివారిపై ఉన్న భక్తి, విశ్వాసాలతో డాలర్లను కొనుగోలు చేసేందుకు తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట డాలర్ల కౌంటర్ వద్ద బారులు తీరారు. ఆదివారం రూ.70 లక్షల విలువ చేసే డాలర్లు సేల్స్ జరగగా.. సోమవారం రూ.40 లక్షల విలువైన బంగారు డాలర్లను టీటీడీ విక్రయించింది. గతేడాది అక్షయ తృతీయ నాడు సుమారు రూ.90 లక్షల విలువ చేసే డాలర్లను మాత్రమే విక్రయించింది.
తిరుమల శ్రీవారి దర్శనం కోసమే కాదు ఆయన ముద్రతో ఉన్న డాలర్ల కోసం కూడా భక్తులు ఎగబడ్డారు. బంగారం ధరలు పెరిగినప్పటికి భక్తుల్లో ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన కౌంటర్ దగ్గర నిలబడి మరీ శ్రీవారి డాలర్లను కొనుగోలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు విక్రయాలు జరపగా ఆదివారం రూ.70 లక్షలు, సోమవారం రూ.40 లక్షల విలువైన బంగారు డాలర్లను టీటీడీ విక్రయించింది. గతేడాది అక్షయ తృతీయ నాడు సుమారు రూ.90 లక్షల అమ్మకాలు జరగ్గా, ఈసారి ఆ రికార్డును అధిగమించడం విశేషం.
అక్షయ తృతీయ రోజున శ్రీవారి ప్రతిమ ఉన్న బంగారు డాలరు కొనుగోలు చేస్తే శుభం కలుగుతుందని, సిరిసంపదలు వృద్ధి చెందుతాయని భక్తులు నమ్ముతుంటారు. బంగారు డాలర్లతో పాటు వెండి, రాగి డాలర్లను కూడా టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది.గతంలో ఈ శ్రీవారి డాలర్ల కొరత ఉన్నప్పటికి వాటిని అధిగమించేలా ఈసారి టీటీడీ భక్తులకు సరిపడ డాలర్లను తయారు చేయించి విక్రయించింది. ఈవిధంగా వచ్చిన డబ్బును కూడా టీటీడీ భక్తులకు, టీటీడీ టెంపుల్ అభివృద్దికి ఖర్చు చేయనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Tirumala,Chittoor,Andhra Pradesh
Apr 21, 2026 10:07 AM IST



