అవకాశాలు రాకపోతేనే ఎక్కువ నేర్చుకుంటాం
హైదరాబాద్: అవకాశాలు రాకపోతేనే ఎక్కువగా నేర్చుకుంటామని, అనుభవాలే తన కెరీర్‌ను తీర్చిదిద్దాయని అంటోంది బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్. వైవిధ్యభరితమైన పాత్రలు, కథలతో సినీప్రియుల్ని ఆకట్టుకుంటుంది. గతేడాది ‘ఎమర్జెన్సీ’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించింది. ప్రస్తుతం ‘భారత్ భాగ్య విధాత’ అనే సినిమా చిత్రీకరణలో బిజీగా గడుపుతోందీ తార. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగన సినీ రంగంలో తన తొలి రోజుల్ని గుర్తుచేసుకుంటూ అభిమానులతో కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. ‘ముంబైలో నేను ఇంకా నిలదొక్కుకోవడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో అగ్రహీరో సల్మాన్ ఖాన్‌ను కలిశాను. అప్ప్పుడు నాకు కేవలం 16, 17ఏళ్లు ఉంటాయి. ‘గ్యాంగ్‌స్టర’ సినిమా ఇంకా రాలేదు. అప్ప్పుడు సల్మాన్ ‘ఈమె సంజయ్ లీలా భన్సాలీ హీరోయిన’ అని ప్రశంసించారు. నన్ను వెళ్లి ఆయన్ను కలువమని చెప్పారు. నా దృష్టిలో ఇది చాలా పెద్ద ప్రశంస. సల్మాన్ సూచనతో నేను భన్సాలీని సంప్రదించాను. నన్ను సల్మాన్ పంపించారని చెప్పా. అప్ప్పుడు భన్సాలీ నాతో ఏ ప్రాజెక్టు గురించి ఒప్పందం చేసుకోలేదు… కానీ ఇప్ప్పుడు ఆయన నన్ను కలిసినప్ప్పుడల్లా నేను సల్మాన్ మాట విని ఉండాల్సిందని అంటుంటారు. ‘క్వీన’, ‘తను వెడ్స్ మను రిటర్న్స’ తర్వాత ‘రామ్‌లీలా’లోని ప్రత్యేక పాట కోసం భన్సాలీ నన్ను సంప్రదించారు. కానీ నేను ఐటెమ్ నంబర్లు చేయాలనుకోవడం లేదని చెప్పాను’. అని ఆ రోజులను గుర్తు చేసుకుంది. చిత్ర పరిశ్రమలో వర్కింగ్ అవర్స్ గురించి మాట్లాడుతూ…నటించే విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు కొందరు కోరుకుంటారు. అప్పట్లో మేము సినిమా కోసం ఎన్ని గంటలైనా పనిచేసేవాళ్లం. దేనికైనా రడీ అనేవాళ్లం, చాలా ఉత్సుకతతో ఉండేవాళ్లం. అందుకే మేము సక్సెస్ అయ్యాం అన్నారు.
సంస్కృతి, ప్రాంతీయ కథలపై దృష్టిసారిస్తున్న దక్షిణాది చిత్రాలు ఎక్కువ గుర్తింపును పొందుతున్నాయి. ఇటీవలే విడుదలైన ‘ధురంధర’ చిత్రపరిశ్రమకు పునరుజ్జీవం పోసింది. ఇది ప్రేక్షకులతో నేరుగా మాట్లాడుతోంది. ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు చూడాలనుకుంటున్నారన్నారు. ప్రారంభంలో నాకు గుర్తింపు లభించకపోవడం కారణంగానే ఒక చిత్రనిర్మాత, రచయితగా నన్ను నేను నిలబెట్టుకున్నాను. అనుభవాలే మనకు ఇంకా ఎక్కువ విషయాల్ని నేర్పిస్తాయని తన కెరీర్ గురించి చెప్ప్పుకొచ్చింది కంగన
The post అనుభవాలే కెరీర్‌ను తీర్చిదిద్దాయి- కంగనా రనౌత్ appeared first on Visalaandhra.


