పాఠశాల విద్య పరిధిలోకి ఇంటర్మీడియట్ విద్యను తీసుకువస్తూ, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ బోర్డులను కలిపి ఒకే ఒక ‘తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు’గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సెలవులు ముగుస్తున్నందున జూనియర్ కాలేజీల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు జూన్ 1 నాటికి కాలేజీ ప్రాంగణాలను శుభ్రం చేసి, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, అకడమిక్ క్యాలెండర్‌ను ఖచ్చితంగా పాటించాలని అధికారులు ఆదేశించారు.



