చిత్తశుద్ధి లేక ‘చెత్త’ను వదిలేశారు


విజయవాడలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప’లో మంత్రి నారాయణó
విజయవాడ: గత ప్రభుత్వం పారిశుధ్యంపై కనీసం చిత్తశుద్ధి చూపలేదని, వారు వదిలిపెట్టిన చెత్తను కూటమి తొలగిస్తోందని పురుపాలక శాఖా మంత్రి నారాయణ మండిపడ్డారు. విజయవాడ రైల్వేస్టేషన్ సమీపంలో ఆపరేషన్ క్లీన్‌స్వీప్ కార్యక్రమాన్ని మంత్రి శనివారం ప్రారంభించి మాట్లాడారు. ‘రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, డంప్‌యార్డ్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నాలుగు వారాల ప్రత్యేక స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలుచేస్తున్నట్టు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వదిలేసిన 153 లక్షల టన్నుల వ్యర్థాల్లో… ఇప్పటికే 85 లక్షల టన్నుల చెత్తను తొలగించాం. మిగిలిన చెత్తనూ జూన్ చివరికి పూర్తిగా తొలగించాలనే లక్ష్యం పెట్టుకున్నాం. చెత్త నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. విశాఖపట్టణం, గుంటూరులో ప్లాంట్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. మరో ఆరు ప్లాంట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రెండేళ్లలో వీటిని పూర్తిచేసి చెత్త నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేస్తాం’ అని మంత్రి నారాయణ అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ మాట్లాడుతూ… గత ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో రాష్ట్రానికి ఐదు అవార్డులు వచ్చాయని, ఈసారి మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ మాట్లాడుతూ… బహిరంగ మూత్రవిసర్జన నివారణకు వినూత్న చర్యలు చేపడుతున్నామని, ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. విజయాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్‌కుమార్‌రెడ్డి, గొట్టుముక్కల రఘురామరాజు పాల్గొన్నారు.

The post చిత్తశుద్ధి లేక ‘చెత్త’ను వదిలేశారు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *