అరెస్ట్‌కు నేను సిద్ధం.. బెయిల్ అడగను: ప్రొఫెసర్ నాగేశ్వర్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తాను చేసిన వ్యాఖ్యల వివాదంపై నమోదైన కేసుల విషయంలో రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, తాను అరెస్ట్‌కు సిద్ధంగా ఉన్నానని, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించబోనని స్పష్టం చేశారు. నాపై కేసు నమోదు చేశారు. ఆ మరుసటి రోజే నన్ను అరెస్ట్ చేస్తారని నాకు సమాచారం అందింది. నేను ఎక్కడికీ వెళ్లను, ఇంట్లోనే ఉంటాను, అరెస్ట్ చేసుకోండి. ఇప్పటివరకు…


